Breaking News

ఇక రైళ్లలో స్విగ్గీ ఫుడ్‌ డెలివరీ: IRCTC ఒప్పందం.. ముందుగా ఈ 4 స్టేషన్‌లలో ప్రారంభం!!

దేశంలో అతిపెద్ద రవాణా వ్యవస్థ అంటే భారతీయ రైల్వే అని మనకు తెలిసిందే. ప్రతి రోజు లక్షలాది మంది ప్రయాణికులు రైళ్లలో ప్రయాణిస్తున్నారు. దీని కోసం రైల్వే శాఖ కూడా అన్ని రకాల సదుపాయాలను అందిస్తోంది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎప్పటికప్పుడు సదుపాయాలను మెరుగు పరుస్తోంది. అయితే రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులకు నాణ్యమైన ఫుడ్‌ అందించేందుకు రైల్వే శాఖ చర్యలు చేపడుతోంది. IRCTC పోర్టల్ ద్వారా రైలు ప్రయాణికులకు ముందస్తుగా బుక్ చేసుకున్న ఆహారాన్ని డెలివరీ చేసేందుకు స్విగ్గితో ఐఆర్‌సిటిసి ఒప్పందం చేసుకుంది.


Published on: 24 Feb 2024 15:48  IST

IRCTC పోర్టల్ ద్వారా రైలు ప్రయాణికులకు ముందస్తుగా బుక్  చేసుకున్న వారికి ఆహారాన్ని డెలివరీ చేసేందుకు స్విగ్గితో IRCTC ఒప్పందం చేసుకుంది. ప్రస్తుతానికి, బెంగళూరుతో సహా కొన్ని ఎంపిక చేసిన రైల్వే స్టేషన్లలో ఇది అమలు చేయబడుతుంది. ఈ సర్వీసు ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలియదు. ప్రీ-ఆర్డర్ చేసిన ఆహారాన్ని డెలివరీ కోసం Swiggyతో చేతులు కలిపినట్లు IRCTC స్టాక్ ఎక్స్ఛేంజ్‌కి తన ఫైలింగ్‌లో సమాచారం ఇచ్చింది.

IRCTC ఇ-క్యాటరింగ్ పోర్టల్ ద్వారా ప్రీ-బుక్ చేసిన ఆహారాన్ని సరఫరా చేయడానికి, డెలివరీ చేయడానికి బండిల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ (స్విగ్గీ ఫుడ్స్)తో ఐఆర్‌సీటీసీ ఒప్పందం చేసుకుంది. తొలి దశలో బెంగళూరు, విజయవాడ, విశాఖపట్నం, భువనేశ్వర్ ఈ  నాలుగు రైల్వే స్టేషన్లలో సర్వీసును ప్రారంభించనున్నట్లు IRCTC తెలిపింది. ఈ సేవ ఎప్పుడు ప్రారంభమవుతుందో IRCTC స్పష్టం చేయలేదు.

Follow us on , &

ఇవీ చదవండి