Breaking News

తమిళనాడు TNPDCలో జూనియర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న ఒక వ్యక్తి తన భార్య, కూతురితో కలిసి ఆత్మహత్య చేసుకున్నారు.

కోయంబత్తూరులో ఫిబ్రవరి 2, 2026న జరిగిన విషాద ఘటన.తమిళనాడు పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (TNPDC)లో జూనియర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న ఒక వ్యక్తి తన భార్య, కూతురితో కలిసి ఆత్మహత్య చేసుకున్నారు. 


Published on: 03 Feb 2026 10:15  IST

కోయంబత్తూరులో ఫిబ్రవరి 2, 2026న జరిగిన విషాద ఘటన.తమిళనాడు పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (TNPDC)లో జూనియర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న ఒక వ్యక్తి తన భార్య, కూతురితో కలిసి ఆత్మహత్య చేసుకున్నారు. బి. కమలేష్ (42) కదిర్నాయకన్‌పాళయం సబ్‌స్టేషన్‌లో జూనియర్ ఇంజనీర్.సి. ఇలకియా (38) ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో స్టాఫ్ నర్సుగా పనిచేసేవారు.ఎక్షిదా ఏంజెల్ (10) వీరి కుమార్తె, 5వ తరగతి చదువుతోంది.

భార్య ఇలకియా గత రెండేళ్లుగా రొమ్ము క్యాన్సర్‌ (Breast Cancer)తో బాధపడుతున్నారు. ఇటీవల వైద్య పరీక్షల్లో క్యాన్సర్ శరీరమంతా వ్యాపించిందని, ఆమె బ్రతికే అవకాశాలు తక్కువని డాక్టర్లు చెప్పడంతో మనస్తాపానికి గురైన కమలేష్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

కమలేష్ ఒక సాఫ్ట్ డ్రింక్‌లో సైనేడ్ కలిపి, భార్యాబిడ్డలతో సహా సేవించారు. ఆత్మహత్యకు ముందు ఆయన తన బంధువులకు మరియు సహోద్యోగులకు ఒక వీడియో సందేశం పంపారు. అందులో తన భార్య పడుతున్న బాధను చూడలేకే ఈ నిర్ణయం తీసుకున్నామని, తమ మృతదేహాలను పెరియనాయకన్‌పాళయంలోని సి.ఎస్.ఐ (CSI) చర్చిలో అంత్యక్రియలు చేయాలని, తన పొదుపు మొత్తాన్ని చర్చికి విరాళంగా ఇవ్వాలని కోరారు. 

Follow us on , &

ఇవీ చదవండి