Breaking News

దూరదర్శన్ మాజీ ప్రముఖ న్యూస్ రీడర్ సరళా మహేశ్వరి గురువారం రోజున  ఢిల్లీలో కన్నుమూశారు.

దూరదర్శన్ మాజీ ప్రముఖ న్యూస్ రీడర్ సరళా మహేశ్వరి (Sarla Maheshwari) ఫిబ్రవరి 12, 2026 గురువారం రోజున ఢిల్లీలో కన్నుమూశారు.


Published on: 13 Feb 2026 11:22  IST

దూరదర్శన్ (Doordarshan) మాజీ ప్రముఖ న్యూస్ రీడర్ సరళా మహేశ్వరి (Sarla Maheshwari) ఫిబ్రవరి 12, 2026 గురువారం రోజున ఢిల్లీలో కన్నుమూశారు. ఆమె వయస్సు 71 ఏళ్లు. ఆమె మృతి పట్ల దూరదర్శన్ నేషనల్ సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేసింది.1976 నుండి 2005 వరకు దాదాపు మూడు దశాబ్దాల పాటు దూరదర్శన్‌లో న్యూస్ రీడర్‌గా సేవలందించారు.

1980, 90వ దశకాల్లో ఆమె వార్తలు చదివే విధానం, స్పష్టమైన ఉచ్చారణతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. బ్లాక్ అండ్ వైట్ నుండి కలర్ టెలివిజన్ వరకు జరిగిన మార్పుల్లో ఆమె కీలక పాత్ర పోషించారు.ఫిబ్రవరి 12వ తేదీ సాయంత్రం 4 గంటలకు ఢిల్లీలోని నిగంబోధ్ ఘాట్‌లో ఆమె అంత్యక్రియలు జరిగాయి. ఆమె సహచర వార్తా వ్యాఖ్యాత షమ్మీ నారంగ్ సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని ధృవీకరిస్తూ ఆమె మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి