Breaking News

వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో నాసిరకం భోజనం వడ్డించినందుకు గానూ రైల్వే శాఖ తన సొంత సంస్థ అయిన IRCTC పై ₹10 లక్షల జరిమానా విధించింది.

పాట్నా-టాటానగర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో నాసిరకం భోజనం (పురుగులు ఉన్న పెరుగు, పప్పు) వడ్డించినందుకు గానూ రైల్వే శాఖ తన సొంత సంస్థ అయిన IRCTC పై ₹10 లక్షల జరిమానా విధించింది.


Published on: 26 Mar 2026 15:25  IST

పాట్నా-టాటానగర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో నాసిరకం భోజనం (పురుగులు ఉన్న పెరుగు, పప్పు) వడ్డించినందుకు గానూ రైల్వే శాఖ తన సొంత సంస్థ అయిన IRCTC పై ₹10 లక్షల జరిమానా విధించింది.

ఐఆర్‌సీటీసీ (IRCTC) పై ₹10 లక్షల పెనాల్టీ విధించడంతో పాటు, ఆహారాన్ని సరఫరా చేసిన ప్రైవేట్ క్యాటరింగ్ సర్వీస్ ప్రొవైడర్‌పై ₹50 లక్షల భారీ జరిమానా విధించి, వారి కాంట్రాక్టును రద్దు చేశారు.మార్చి 15, 2026న పాట్నా-టాటానగర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (రైలు నంబర్ 21896) లో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తికి వడ్డించిన పెరుగు (అముల్ దహీ) మరియు పప్పులో లైవ్ పురుగులు కనిపించాయి.

ప్రయాణికుడు ఈ విషయాన్ని ప్రశ్నిస్తే, అక్కడి సిబ్బంది అవి పురుగులు కాదని, కుంకుమపువ్వు (కేసర్) అని బుకాయించే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో రైల్వే శాఖ సీరియస్ యాక్షన్ తీసుకుంది.పెరుగు ప్యాకెట్ తయారీ తేదీ మార్చి 4 అని, కానీ దానిని మార్చి 15న అంటే 11 రోజుల తర్వాత వడ్డించారని, అప్పటికే దాని గడువు (Expiry) ముగిసిందని విచారణలో తేలింది.

Follow us on , &

ఇవీ చదవండి