Breaking News

తల్లి పక్కన నిద్రిస్తున్న రెండు నెలల పసికందును ఒక చిరుతపులి నోట కరుచుకుని అటవీ ప్రాంతంలోకి లాక్కెళ్లిపోయింది

మహారాష్ట్రలోని జల్‌గావ్  జిల్లాలో 31 మార్చి 2026న ఒక అత్యంత విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. తన తల్లి పక్కన నిద్రిస్తున్న రెండు నెలల పసికందును ఒక చిరుతపులి నోట కరుచుకుని అటవీ ప్రాంతంలోకి లాక్కెళ్లిపోయింది. 

Published on: 31 Mar 2026 19:01  IST

మహారాష్ట్రలోని జల్‌గావ్ జిల్లాలో 31 మార్చి 2026న ఒక అత్యంత విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. తన తల్లి పక్కన నిద్రిస్తున్న రెండు నెలల పసికందును ఒక చిరుతపులి నోట కరుచుకుని అటవీ ప్రాంతంలోకి లాక్కెళ్లిపోయింది. 

జల్‌గావ్ జిల్లా, చోప్డా తాలూకాలోని మమల్డే  గ్రామం.వేసవి కాలం కావడంతో ఉక్కపోత భరించలేక, బాధితురాలు తన రెండు నెలల ఆడబిడ్డతో కలిసి ఇంటి బయట (ఆరుబయట) మంచంపై నిద్రిస్తోంది.తెల్లవారుజామున అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో సమీప అటవీ ప్రాంతం నుంచి వచ్చిన చిరుతపులి, తల్లి పక్కనే ఉన్న పసికందును ఎత్తుకెళ్లిపోయింది.

తెల్లవారుజామున తల్లి నిద్రలేచి చూడగా బిడ్డ కనిపించలేదు. కుటుంబ సభ్యులు, గ్రామస్థులు కలిసి వెతకగా, ఇంటికి కొద్ది దూరంలోని పొలాల్లో గోధుమ గడ్డి కుప్ప వద్ద బిడ్డకు సంబంధించిన శరీర భాగాలు లభ్యమయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు మరియు అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.ఈ ఘటనపై చోప్డా సిటీ పోలీస్ స్టేషన్లో అనుమానాస్పద మృతిగా కేసు నమోదైంది.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement