Breaking News

దేశ అత్యున్నత అంతర్గత భద్రతా సంస్థ అయిన ఇంటెలిజెన్స్ బ్యూరో నూతన చీఫ్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి డాక్టర్ మహేష్ దీక్షిత్ కేంద్ర ప్రభుత్వం నియమించింది.

దేశ అత్యున్నత అంతర్గత భద్రతా సంస్థ అయిన ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) నూతన చీఫ్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి డాక్టర్ మహేష్ దీక్షిత్ కేంద్ర ప్రభుత్వం నియమించింది.


Published on: 26 Jun 2026 14:12  IST

దేశ అత్యున్నత అంతర్గత భద్రతా సంస్థ అయిన ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) నూతన చీఫ్గా సీనియర్ ఐపీఎస్ అధికారి డాక్టర్ మహేష్ దీక్షిత్ కేంద్ర ప్రభుత్వం నియమించింది.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేబినెట్ నియామకాల కమిటీ జూన్ 25న ఈ నిర్ణయానికి ఆమోద ముద్ర వేసింది.

పదవీ బాధ్యతలు: ప్రస్తుతం ఐబీలో స్పెషల్ డైరెక్టర్‌గా ఉన్న ఆయన, ప్రస్తుత ఐబీ చీఫ్ తపన్ కుమార్ డేకా స్థానంలో బాధ్యతలు చేపట్టనున్నారు. తపన్ కుమార్ డేకా పదవీ కాలం జూన్ 30తో ముగియనుంది.

పదవీ కాలం: ఆయన బాధ్యతలు స్వీకరించిన నాటి నుండి రెండేళ్ల పాటు లేదా తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ పదవిలో కొనసాగుతారు.

కేడర్: ఈయన 1993 బ్యాచ్‌కు చెందిన తెలంగాణ క్యాడర్ ఐపీఎస్ అధికారి.

విద్యార్హత: ఐపీఎస్ అధికారి కావడానికి ముందు ఆయన ఒక వైద్యుడు.

ఆయన అనుభవం & ప్రాధాన్యత

ఆర్టికల్ 370 రద్దు సమయంలో పాత్ర: జమ్మూ కాశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు చేసిన తదనంతర కాలంలో శ్రీనగర్‌లోని సబ్సిడియరీ ఇంటెలిజెన్స్ బ్యూరో (SIB) అధిపతిగా ఉగ్రవాద నిరోధక చర్యలను సమర్థవంతంగా పర్యవేక్షించి, అక్కడ శాంతిభద్రతల పునరుద్ధరణలో కీలక పాత్ర పోషించారు.

దేశ భద్రతలో అనుభవం: దాదాపు మూడు దశాబ్దాల కెరీర్‌లో ఐబీలోనే ఎక్కువ కాలం పనిచేసిన ఆయనకు కౌంటర్ టెర్రరిజం, నక్సలిజం అణచివేత, మరియు సరిహద్దు నిఘా వ్యవహారాల్లో అపారమైన అనుభవం ఉంది.

భారతదేశ అంతర్గత భద్రతను పర్యవేక్షించే అత్యున్నత నిఘా సంస్థకు తెలుగు రాష్ట్రాల కేడర్ అధికారి పీఠం దక్కడం విశేషం.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement