Breaking News

తమిళనాడులోని తెన్‌కాశీ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం ఎదురెదురుగా వస్తున్న రెండు ప్రైవేట్ బస్సులు ఢీ

తమిళనాడులోని తెన్‌కాశీ జిల్లాలో ఈరోజు (నవంబర్ 24, 2025) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న రెండు ప్రైవేట్ బస్సులు ఢీకొన్న ఘటనలో కనీసం ఆరుగురు మృతి చెందగా, 50 మందికి పైగా గాయపడ్డారు. 


Published on: 24 Nov 2025 14:12  IST

తమిళనాడులోని తెన్‌కాశీ జిల్లాలో ఈరోజు (నవంబర్ 24, 2025) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న రెండు ప్రైవేట్ బస్సులు ఢీకొన్న ఘటనలో కనీసం ఆరుగురు మృతి చెందగా, 50 మందికి పైగా గాయపడ్డారు

తెన్‌కాశీ జిల్లాలోని కడయనల్లూరు సమీపంలోని దురైసామిపురం జంక్షన్ వద్ద ఈ ప్రమాదం జరిగింది.మదురై నుంచి సెంకొట్టాయ్‌కు వెళ్తున్న 'కైసర్ ట్రావెల్స్' బస్సు, తెన్‌కాశీ నుంచి కోవిల్‌పట్టికి వస్తున్న మరో బస్సును ఢీకొట్టింది.ప్రాథమిక విచారణలో మదురై వైపు వెళ్తున్న బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం, అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు నిర్ధారించారు.ఈ ఘటనలో ఐదుగురు మహిళలు, ఒక పురుషుడు సహా ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 50 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులను తెన్‌కాశీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు, వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. తెన్‌కాశీ జిల్లా కలెక్టర్, ఎస్పీ ఘటనా స్థలాన్ని సందర్శించి సహాయక చర్యలను పర్యవేక్షించారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసి, మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి