Breaking News

కోయంబత్తూరులో ఒక వ్యక్తి తన భార్యను హత్య చేసి, ఆ మృతదేహంతో సెల్ఫీ తీసుకుని, దానిని తన వాట్సాప్ స్టేటస్‌లో

డిసెంబర్ 1, 2025నాడు తమిళనాడులోని కోయంబత్తూరులో ఒక వ్యక్తి తన భార్యను హత్య చేసి, ఆ మృతదేహంతో సెల్ఫీ తీసుకుని, దానిని తన వాట్సాప్ స్టేటస్‌లో "నమ్మకద్రోహానికి మూల్యం మరణం" అనే శీర్షికతో పోస్ట్ చేశాడు.

Published on: 01 Dec 2025 11:17  IST

డిసెంబర్ 1, 2025నాడు తమిళనాడులోని కోయంబత్తూరులో ఒక వ్యక్తి తన భార్యను హత్య చేసి, ఆ మృతదేహంతో సెల్ఫీ తీసుకుని, దానిని తన వాట్సాప్ స్టేటస్‌లో "నమ్మకద్రోహానికి మూల్యం మరణం" అనే శీర్షికతో పోస్ట్ చేశాడు.

తమిళనాడులోని కోయంబత్తూరులో ఉన్న మహిళా హాస్టల్ లో జరిగింది. తిరునెల్వేలి జిల్లాకు చెందిన బాలమురుగన్ అతని భార్య శ్రీప్రియ .శ్రీప్రియకు మరొక వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని బాలమురుగన్ అనుమానించాడు.కొంతకాలంగా భార్యాభర్తలు విడివిడిగా ఉంటున్నారు. ఆదివారం మధ్యాహ్నం బాలమురుగన్ తన భార్య ఉంటున్న హాస్టల్‌కు వెళ్లి ఆమెతో గొడవపడ్డాడు. ఆవేశంలో కత్తితో ఆమెను దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత, మృతదేహం పక్కనే నిలబడి సెల్ఫీ తీసుకుని, దానిని వాట్సాప్ స్టేటస్‌లో పెట్టాడు.పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, బాలమురుగన్‌ను అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి