Breaking News

ప్రముఖ హిందీ సాహితీవేత్త, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత వినోద్ కుమార్ శుక్లా (88) అనారోగ్యంతో కన్నుమూశారు

ప్రముఖ హిందీ సాహితీవేత్త, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత వినోద్ కుమార్ శుక్లా (88) అనారోగ్యంతో కన్నుమూశారు. డిసెంబర్ 23, 2025 (మంగళవారం) సాయంత్రం 4:58 గంటలకు రాయ్‌పూర్ (ఛత్తీస్‌గఢ్) లోని ఎయిమ్స్ (AIIMS) ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు


Published on: 24 Dec 2025 12:35  IST

ప్రముఖ హిందీ సాహితీవేత్త, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత వినోద్ కుమార్ శుక్లా (88) అనారోగ్యంతో కన్నుమూశారు. డిసెంబర్ 23, 2025 (మంగళవారం) సాయంత్రం 4:58 గంటలకు రాయ్‌పూర్ (ఛత్తీస్‌గఢ్) లోని ఎయిమ్స్ (AIIMS) ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు.గత కొంతకాలంగా శ్వాసకోస సంబంధిత సమస్యలు (ఇంటర్‌స్టీషియల్ లంగ్ డిసీజ్), న్యుమోనియా మరియు వయసు రీత్యా వచ్చే ఇతర ఆరోగ్య సమస్యలతో ఆయన బాధపడుతున్నారు.

2025 మార్చిలో ఆయనకు దేశ అత్యున్నత సాహిత్య పురస్కారమైన 59 జ్ఞానపీఠ్ అవార్డు లభించింది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నుండి ఈ గౌరవం పొందిన మొదటి రచయితగా ఆయన గుర్తింపు పొందారు.

ఆయన రాసిన 'దీవార్ మే ఏక్ ఖిడ్కీ రెహ్తీ థీ' (Deewar Mein Ek Khidki Rehti Thi) నవలకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. 'నౌకర్ కీ కమీజ్' (Naukar Ki Kameez) ఆయన మరో ప్రముఖ నవల.

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తదితర ప్రముఖులు ఆయన మరణం పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ, ఇది సాహిత్య రంగానికి తీరని లోటని పేర్కొన్నారు. 

Follow us on , &

ఇవీ చదవండి