Breaking News

పశ్చిమ సింఘ్‌భూమ్ జిల్లాలో గత రెండు రోజుల్లోనే ఒకే ఏనుగు దాడిలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు.

జార్ఖండ్‌లో గత కొన్ని రోజులుగా అడవి ఏనుగుల దాడులు తీవ్ర కలకలం రేపుతున్నాయి. పశ్చిమ సింఘ్‌భూమ్ జిల్లాలో గత రెండు రోజుల్లోనే ఒకే ఏనుగు దాడిలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు.


Published on: 08 Jan 2026 11:45  IST

జార్ఖండ్‌లో గత కొన్ని రోజులుగా అడవి ఏనుగుల దాడులు తీవ్ర కలకలం రేపుతున్నాయి. పశ్చిమ సింఘ్‌భూమ్ జిల్లాలో గత రెండు రోజుల్లోనే ఒకే ఏనుగు దాడిలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. గత వారం రోజుల్లో ఈ ప్రాంతంలో ఏనుగుల దాడి కారణంగా మరణించిన వారి సంఖ్య 16కు చేరుకుంది.

జనవరి 6 రాత్రి నోవాముండి బ్లాక్‌లోని భర్బరియా గ్రామంలో ఏనుగు దాడి చేయడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులతో సహా మొత్తం ఆరుగురు మరణించారు.జనవరి 5 రాత్రి గోయిల్కేరా బ్లాక్‌లోని సోవాన్ గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు (తండ్రి మరియు ఇద్దరు పిల్లలు) ఏనుగు దాడిలో మృతి చెందారు.

మదమెక్కిన ఒక ఒంటరి ఏనుగు (Tusker in musth) జనావాసాలపై పడి బీభత్సం సృష్టిస్తోంది. ఈ ఏనుగు ప్రస్తుతం రామ్‌గఢ్ మరియు పశ్చిమ సింఘ్‌భూమ్ జిల్లాల సరిహద్దుల్లో సంచరిస్తోంది.ఏనుగును అడవిలోకి పంపేందుకు పశ్చిమ బెంగాల్‌లోని బాంకురా నుండి నిపుణుల బృందాన్ని రప్పించారు. అటవీ శాఖ అధికారులు డ్రోన్ల ద్వారా ఏనుగు కదలికలను గమనిస్తూ, ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.అడవుల ఆక్రమణ మరియు ఏనుగుల ఆవాసాలు దెబ్బతినడం వల్లే ఇవి జనారణ్యంలోకి వస్తున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

Follow us on , &

ఇవీ చదవండి