Breaking News

ఉచిత బస్సు సౌకర్యం లిస్టులో మరో రాష్ట్రం.. ఆ కుటుంబాలకు గుడ్ న్యూస్ చెప్పిన ముఖ్యమంత్రి

కర్ణాటక, తెలంగాణాలలో ఉచిత బస్సు ప్రయాణానికి ప్యాసింజర్లు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు . ఇదిలా ఉండగా.. తాజాగా హర్యానా ముఖ్యమంత్రి బడ్జెట్ 2024 ప్రవేశ పెడుతూ ప్రజలకు మరో గుడ్ న్యూస్ అందించారు. రూ. 1 లక్ష కంటే తక్కువ వార్షిక ఆదాయం ఉన్న కుటుంబాలకు హర్యానా రోడ్‌వేస్ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేసే వెసులు బాటు కల్పిస్తున్నట్లు ప్రకటించారు.


Published on: 24 Feb 2024 12:36  IST

ప్రస్తుతం రాష్ట్రంలో ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం ట్రెండింగ్ మారింది. కర్ణాటక, తెలంగాణలలో ఈ పథకం ను ప్రారంభించి, కొనసాగిస్తున్నారు. దీనికి ప్రజల నుంచి మంచి స్పందన కూడా వస్తుంది. తాజాగా, ఈ లిస్టులో మరో రాష్ట్రం కూడా వచ్చి చేరనుంది. తాజాగా హర్యానా ముఖ్యమంత్రి బడ్జెట్ 2024 ప్రవేశ పెడుతూ ప్రజలకు మరో గుడ్ న్యూస్ అందించారు. రూ. 1 లక్ష కంటే తక్కువ వార్షిక ఆదాయం ఉన్న కుటుంబాలకు హర్యానా రోడ్‌వేస్ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేసే వెసులు బాటు కల్పిస్తున్నట్లు ప్రకటించారు.

దాదాపు 22.89 లక్షల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం హర్యానా రోడ్‌వేస్ బస్సుల్లో 1,000 కి.మీ ఉచిత ప్రయాణాన్ని అందించనున్నట్లు సీఎం ఖట్టర్ ప్రకటించారు. అదే విధంగా.. అన్ని పంటలపై ఎంఎస్‌పికి చట్టబద్ధమైన హామీ ఇవ్వాలని రైతులు పంజాబ్,ఢిల్లీ బార్డర్ లో భారీగా నిరసనలు చేపట్టిన విషయం తెలిసిందే.
 

Follow us on , &

ఇవీ చదవండి