Breaking News

ప్రముఖ భారతీయ నేపథ్య గాయని ఆశా భోస్లే (92) అనారోగ్యంతో ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు

ప్రముఖ భారతీయ నేపథ్య గాయని ఆశా భోస్లే (92) అనారోగ్యంతో ఏప్రిల్ 12, 2026న ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.


Published on: 13 Apr 2026 11:56  IST

ప్రముఖ భారతీయ నేపథ్య గాయని ఆశా భోస్లే (92) అనారోగ్యంతో ఏప్రిల్ 12, 2026న ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా ఛాతీ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న ఆమె గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఏప్రిల్ 13న ముంబైలోని శివాజీ పార్కులో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నారు.

ఎనిమిది దశాబ్దాలకు పైగా సాగిన ఆమె ప్రస్థానంలో దాదాపు 20 భాషల్లో 12,500 కంటే ఎక్కువ పాటలు పాడారు.ఆమె అసాధారణ ప్రతిభకు గానూ పద్మ విభూషణ్దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులతో పాటు ఎన్నో జాతీయ అవార్డులను అందుకున్నారు.అత్యధిక స్టూడియో రికార్డింగ్స్ చేసిన గాయనిగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను సొంతం చేసుకున్నారు. 

తెలుగులో కూడా ఆమె 'ప్రేమ లేఖలు' వంటి సినిమాల్లో మధురమైన పాటలు పాడి ఇక్కడి ప్రేక్షకులకు సుపరిచితులయ్యారు. ఆమె మృతితో భారతీయ సంగీత ప్రపంచం ఒక ధృవతారను కోల్పోయిందని సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. 

Follow us on , &

ఇవీ చదవండి