Breaking News

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోల్‌కతాలోని చౌరంగీలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ, బీజేపీని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ 24 ఏప్రిల్ 2026న కోల్‌కతాలోని చౌరంగీలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ, బీజేపీని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. 


Published on: 25 Apr 2026 14:52  IST

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ 24 ఏప్రిల్ 2026న కోల్‌కతాలోని చౌరంగీలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ, బీజేపీని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. 

"నేను బెంగాల్ గడ్డపై పుట్టాను, ఇక్కడే నా చివరి శ్వాస వరకు ఉంటాను. బెంగాల్ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత, విపక్ష పార్టీలన్నింటినీ ఏకం చేసి ఢిల్లీని స్వాధీనం చేసుకుంటాను" అని మమతా ప్రకటించారు.తనకు అధికారం మీద వ్యామోహం లేదని, కేవలం కేంద్రంలో బీజేపీని అధికారంలో నుండి తొలగించడమే తన ప్రధాన లక్ష్యమని ఆమె స్పష్టం చేశారు.పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ 23 ఏప్రిల్ 2026న పూర్తి కాగా, రెండో విడత ఏప్రిల్ 29న జరగనుంది. ఈ క్రమంలో ఆమె తన జాతీయ రాజకీయ లక్ష్యాలను బయటపెట్టారు.

ప్రధాని నరేంద్ర మోదీ చేసిన 'జల్ మురి' వ్యాఖ్యలకు కౌంటర్‌గా ఆమె తనదైన శైలిలో 'భేల్ పురి' తో సమాధానం చెప్పారు. దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి అమిత్ షా, ఆమె వ్యాఖ్యలను కొట్టిపారేస్తూ.. బెంగాల్ ఎన్నికల ఫలితాల తర్వాత మమతా బెనర్జీ రాజకీయంగా కనుమరుగవుతారని, బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి