Breaking News

హవేరీ జిల్లా రిటైర్డ్ ఉపాధ్యాయుడి పట్ల విద్యార్థులు తమకున్న గౌరవాన్ని చాటుకుంటూ రక్త తులాభారం నిర్వహించారు

కర్ణాటకలోని హవేరీ జిల్లా (అక్కి ఆలూరు) లో ఒక రిటైర్డ్ ఉపాధ్యాయుడి పట్ల విద్యార్థులు తమకున్న గౌరవాన్ని చాటుకుంటూ 2025 డిసెంబర్ 21, ఆదివారం నాడు వినూత్నంగా 'రక్త తులాభారం' నిర్వహించారు. 


Published on: 22 Dec 2025 11:20  IST

కర్ణాటకలోని హవేరీ జిల్లా (అక్కి ఆలూరు) లో ఒక రిటైర్డ్ ఉపాధ్యాయుడి పట్ల విద్యార్థులు తమకున్న గౌరవాన్ని చాటుకుంటూ 2025 డిసెంబర్ 21, ఆదివారం నాడు వినూత్నంగా 'రక్త తులాభారం' నిర్వహించారు. రిటైర్డ్ ఉపాధ్యాయుడైన పి.ఆర్. మఠ్ గారికి ఆయన 80వ పుట్టినరోజు సందర్భంగా ఈ గౌరవం దక్కింది.హవేరీ జిల్లాలోని అక్కి ఆలూరులో ఉన్న హానగల్ కుమారేశ్వర కళ్యాణ మంటపంలో ఈ కార్యక్రమం జరిగింది.

సాధారణంగా దేవుళ్లకు లేదా స్వామీజీలకు బంగారం, వెండి లేదా ధాన్యంతో తులాభారం వేయడం చూస్తుంటాం. కానీ, ఇక్కడ ఆయన దగ్గర చదువుకున్న సుమారు 108 మంది విద్యార్థులు స్వచ్ఛందంగా రక్తదానం చేసి, సేకరించిన ఆ రక్తంతో తమ గురువుకు 'రక్త తులాభారం' నిర్వహించారు.

రక్తంతో పాటు పుస్తకాలతో కూడా ఆయనకు తులాభారం వేసి తమ కృతజ్ఞతను చాటుకున్నారు. రిటైర్మెంట్ తర్వాత కూడా ఆయన రాణేబెన్నూరు తాలూకా ముదేనూరులో విద్యార్థులకు ఉచితంగా పాఠాలు చెబుతూ విద్యా సేవ చేస్తున్నారు. ఈ సంఘటన స్థానికంగా అందరినీ ఆకట్టుకుంది. 

Follow us on , &

ఇవీ చదవండి