Breaking News

ఉగ్రవాదం, సైబర్‌ సెక్యూరిటీపై చర్చ.. తులసికి త్రివేణి సంగమ జలం ఇచ్చిన మోదీ

ఉగ్రవాదం, సైబర్‌ సెక్యూరిటీ తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మోదీ ఆమెకు ప్రయాగ్‌రాజ్‌ మహాకుంభమేళా త్రివేణి సంగమ జలం ఇచ్చారు. ప్రతిగా ఆమె మోదీకి రుద్రాక్ష మాల బహూకరించారు.


Published on: 18 Mar 2025 12:28  IST

భారత పర్యటనలో ఉన్న యూఎస్‌ ఇంటలిజెన్స్‌ చీఫ్‌ తులసి గబ్బార్డ్‌ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఉగ్రవాదం, సైబర్‌ సెక్యూరిటీ వంటి ముప్పును ఎదుర్కోవడంలో సహకారం పెంపొందించే మార్గాలు తదితర అంశాలపై చర్చించినట్లు సమాచారం. ఈ సందర్భంగా మోదీ ఆమెకు ప్రయాగ్‌రాజ్‌ మహాకుంభమేళా త్రివేణి సంగమ జలం ఇచ్చారు. ప్రతిగా ఆమె మోదీకి రుద్రాక్ష మాల బహూకరించారు.

ఇటీవల మోదీ అమెరికాలో పర్యటించి నప్పుడు తులసితో సమావేశమయ్యారు. అంతకు ముందు ఆమె రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో సమావేశమయ్యారు. భారత వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న నిషేధిత ఖలిస్థానీ సంస్థ సిఖ్‌ ఫర్‌ జస్టి్‌సపై చర్యలు తీసుకోవాలని రాజ్‌నాథ్‌ ఆమెను కోరారు. రక్షణ రంగం, నిఘా సమాచార పంపిణీపై కూడా సమావేశంలో చర్చించారు. అంతకు ముందు ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తులసి గబ్బార్డ్‌ మాట్లాడుతూ బంగ్లాదేశ్‌లో మైనార్టీల ఊచకోతపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఇస్లామిక్‌ ఉగ్రవాదాన్ని అంతమొందించేందుకు అమెరికా యత్నిస్తోందని చెప్పారు. క్లిష్ట సమయాల్లో తనకు భగవద్గీతలోని శ్రీకృష్ణుడి బోధనలు మార్గదర్శకంగా నిలిచాయని ఏఎన్‌ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె చెప్పారు.

Follow us on , &

ఇవీ చదవండి