Breaking News

కులాంతర వివాహానికి సిద్ధమైందని.. తన తోడబుట్టిన చెల్లిని అన్న చంపేసిన సంఘటన.

వేరే కులానికి చెందిన యువకుడిని ప్రేమించి, పెళ్లి చేసుకోవాలని భావించిన ఓ యువతిని ఆమె సోదరుడే హత్య చేసిన ఘటన


Published on: 03 Apr 2025 13:42  IST

తిరుప్పూరులో పరువు హత్య – యువతిని హతమార్చిన సోదరుడు అరెస్టు

చెన్నై: తిరుప్పూరు జిల్లాలో చోటుచేసుకున్న పరువు హత్య సంఘటన కలకలం రేపింది. వేరే కులానికి చెందిన యువకుడిని ప్రేమించి, పెళ్లి చేసుకోవాలని భావించిన ఓ యువతిని ఆమె సోదరుడే హత్య చేసిన ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

తిరుప్పూరు (Tiruppur) జిల్లా పల్లడం సమీపంలోని పరువాయ్ గ్రామానికి చెందిన దండపాణికి ఇద్దరు పిల్లలు – విద్య (22), శరవణకుమార్‌ (24) ఉన్నారు. కోయంబత్తూరులోని ప్రభుత్వ కళాశాలలో ఎంఏ చదువుతున్న విద్యకు, తిరుప్పూరు విజయపురం ప్రాంతానికి చెందిన వెణ్‌మణి (22) అనే యువకుడితో పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మారింది.కుటుంబ సభ్యులు వారి ప్రేమను ఒప్పుకోలేదు. ఇంట్లో తీవ్ర ఒత్తిడి నెలకొంది. ఈ నేపథ్యంలో, మార్చి 30న విద్య తల్లిదండ్రులు చర్చికి వెళ్లగా, ఇంట్లో ఒంటరిగా ఉండిపోయింది. తిరిగి వచ్చిన సోదరుడు శరవణన్, తండ్రి దండపాణి విద్యను గదిలో కింద పడిపోయి రక్తసిక్తంగా ఉన్న స్థితిలో గుర్తించారు. బీరువా తలపై పడిపోయినట్లు కనిపించడంతో, తక్షణమే అంబులెన్స్‌కు సమాచారం అందించారు.

అంబులెన్స్ సిబ్బంది విద్యను పరీక్షించి అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. కుటుంబ సభ్యులు త్వ‌రగా అంత్యక్రియలు పూర్తి చేశారు. అయితే, వెణ్‌మణి తన ప్రియురాలి మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ గ్రామ అధికారులకు ఫిర్యాదు చేశాడు.దీంతో తహసీల్దార్ శబరగిరి, పోలీసులు విద్య మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం కోసం పంపారు. నివేదికలో బీరువా తలపై పడటంతో మృతి చెందలేదని, వేటకొడవలితో తలపై దాడి చేసి హత్య చేసినట్లు స్పష్టమైంది. కామనాయకన్‌పాళయం పోలీసులు దండపాణి, శరవణకుమార్‌ను విచారించగా సోదరుడు శరవణకుమార్ ఈ హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు.విద్య వేరే కులానికి చెందిన యువకుడిని ప్రేమించడం సహించలేక, ఇనుప కమ్మీతో దాడి చేసి చంపినట్లు పోలీసులు తేల్చారు.దీంతో పోలీసులు పరువు హత్య కేసుగా నమోదు చేసి, శరవణకుమార్‌ను అరెస్టు చేశారు. 

Follow us on , &

ఇవీ చదవండి