Breaking News

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. వారం రోజుల్లో మెగా డీఎస్సీ నోటిఫికేషన్!!

తెలంగాణలో ఉపాధ్యాయ అభ్యర్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌‌ విడుదలకు సమయం ఆసన్నమైంది. మొత్తం 11 వేలకుపైగా పోస్టులతో ఈ మెగా డీఎస్సీ ఉండే అవకాశం ఉంది. గత ప్రభుత్వం ఐదు వేల పైచిలుక పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ నోటిఫికేషన్‌ను రద్దు చేసి.. కొత్త నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నారు.


Published on: 27 Feb 2024 11:23  IST

లోక్​సభ ఎన్నికలకు ముందే ఆరు గ్యారంటీలతో పాటు యువత మద్దతు సంపూర్ణంగా కూడగట్టుకునేందుకు సీఎం రేవంత్​ సర్కార్​ భారీ కసరత్తును ప్రారంభించింది. లోక్​ సభ ఎన్నికల్యలో అత్యధిక స్థానాలు కైవసం చేసుకుని అధిష్టాన వర్గం ముందు మార్కులు కొట్టేసేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. అందులో భాగంగానే కొలువుల జాతర ప్రారంభం కానుంది. కొత్త నోటిఫికేషన్‌లకు రేవంత్ సర్కార్ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది.

ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా డీఎస్సీకి సంబంధించిన ఫైలును సిద్ధం చేసిన విద్యాశాఖ.. దానిని సీఎం కార్యాలయానికి పంపింది. అక్కడి నుంచి అనుమతి రాగానే నోటిఫికేషన్‌ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలిసింది. గతేడాది ఆగస్టులో 5,089 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేష‌ను విద్యాశాఖ జారీ చేసిన విషయం తెలిసిందే. 2,575 ఎస్జీటీ, 1,739 స్కూల్‌ అసిస్టెంట్‌, 611 లాంగ్వేజ్ పండిట్, 164 పీఈటీ పోస్టులను భర్తీ చేయనున్నట్టు ఆ నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఆ నోటిఫికేష‌న్ రద్దుచేసి.. ఖాళీల సంఖ్యను పెంచి మెగా డీఎస్సీ చేపట్టాలని ప్రస్తుత ప్రభుత్వం భావిస్తోంది. వాటికి అదనంగా మరో 6 వేల పోస్టులను కలిపి కొత్త నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి