Breaking News

బస్తర్ ప్రాంతంలోని జగదల్‌పూర్‌లో 108 మంది మావోయిస్టులు ఒకేసారి భద్రతా బలగాల ఎదుట లొంగిపోయారు. 

మార్చి 11, 2026న ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టు ఉద్యమానికి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. బస్తర్ ప్రాంతంలోని జగదల్‌పూర్‌లో 108 మంది మావోయిస్టులు ఒకేసారి భద్రతా బలగాల ఎదుట లొంగిపోయారు. 


Published on: 11 Mar 2026 18:36  IST

మార్చి 11, 2026న ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టు ఉద్యమానికి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. బస్తర్ ప్రాంతంలోని జగదల్‌పూర్‌లో 108 మంది మావోయిస్టులు ఒకేసారి భద్రతా బలగాల ఎదుట లొంగిపోయారు. 

లొంగిపోయిన మావోయిస్టులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు జరిపిన తనిఖీల్లో ₹3.61 కోట్ల నగదు, ఒక కిలో బంగారం (సుమారు ₹1.64 కోట్ల విలువైనది) మరియు భారీ ఎత్తున ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టుల చరిత్రలోనే ఒకేసారి ఇంత పెద్ద మొత్తంలో నగదు దొరకడం ఇదే మొదటిసారి.

లొంగిపోయిన వారిలో ఆరుగురు డివిజనల్ కమాండర్లు ఉన్నారు, వీరిపై ఒక్కొక్కరికి ₹8 లక్షల చొప్పున రివార్డు ఉంది. మొత్తం 108 మందిపై కలిపి దాదాపు ₹3.95 కోట్ల రివార్డు ఉంది.లొంగిపోయిన వారు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ (DKSZC) కి చెందినవారు. జిల్లాల వారీగా చూస్తే:

బీజాపూర్: 37 మంది

దంతెవాడ: 30 మంది

సుక్మా: 18 మంది

బస్తర్: 16 మంది

నారాయణపూర్: 4 గురు

కాంకేర్: 3 గురు

మార్చి 31, 2026 నాటికి దేశం నుండి నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించాలని కేంద్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న గడువు కంటే ముందే ఈ భారీ లొంగుబాటు జరగడం విశేషం.వీరందరికీ ప్రభుత్వం 'పునా మార్గెమ్' (Puna Margem) పథకం కింద పునరావాసం కల్పిస్తోంది. 

Follow us on , &

ఇవీ చదవండి