Breaking News

ఏపీలో పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ద్రోణి ప్రభావంతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మార్చి 18, 2026న పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) మరియు వాతావరణ శాఖ (IMD) హెచ్చరికలు జారీ చేశాయి. 

Published on: 18 Mar 2026 19:12  IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ద్రోణి ప్రభావంతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మార్చి 18, 2026న పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) మరియు వాతావరణ శాఖ (IMD) హెచ్చరికలు జారీ చేశాయి. 

రాబోయే కొన్ని గంటల్లో ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది: పశ్చిమ గోదావరి ,ఏలూరు,ఎన్టీఆర్ (విజయవాడ పరిసరాలు),కృష్ణా.

కింది జిల్లాల్లో కూడా ఉరుములు, మెరుపులు మరియు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది: 

ఉత్తరాంధ్ర: అల్లూరి సీతారామరాజు, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి.

కోస్తాంధ్ర: పోలవరం, కాకినాడ, తూర్పు గోదావరి, గుంటూరు.

రాయలసీమ: నెల్లూరు, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి

కోతకు వచ్చిన పంటలను మరియు ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులు సూచించారు.వర్షం కురిసే సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద లేదా బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని, పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని APSDMA హెచ్చరించింది.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement