Breaking News

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాల్గొన్న వైట్‌హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్‌లో శనివారం రాత్రి కాల్పులు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాల్గొన్న వైట్‌హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్‌) లో ఏప్రిల్ 25, 2026 శనివారం రాత్రి కాల్పులు జరిగాయి.


Published on: 27 Apr 2026 10:17  IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాల్గొన్న వైట్‌హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్‌ లో ఏప్రిల్ 25, 2026 శనివారం రాత్రి కాల్పులు జరిగాయి. వాషింగ్టన్ డీసీలోని వాషింగ్టన్ హిల్టన్ హోటల్.ఏప్రిల్ 25 రాత్రి సుమారు 8:35 గంటల సమయంలో (స్థానిక కాలమానం ప్రకారం) కాల్పుల శబ్దాలు వినిపించాయి.శబ్దాలు రాగానే సీక్రెట్ సర్వీస్ అధికారులు ట్రంప్‌ను, ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్‌ను, ఉపాధ్యక్షుడు జె.డి. వాన్స్‌ను వెంటనే సురక్షిత ప్రాంతానికి తరలించారు.కాల్పులు జరిపిన వ్యక్తిని కాలిఫోర్నియాకు చెందిన కోల్ టోమస్ అలెన్ (Cole Tomas Allen) (31) గా గుర్తించారు. నిందితుడి దగ్గర తుపాకులతో పాటు కత్తులు కూడా ఉన్నాయి. 

ఈ ఘటనలో ఒక సీక్రెట్ సర్వీస్ అధికారికి కాల్పులు తగిలాయి, కానీ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధరించడం వల్ల అతను ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు.కాల్పులకు పది నిమిషాల ముందే నిందితుడు తన కుటుంబ సభ్యులకు ఒక లేఖ (Manifesto) పంపి, ట్రంప్ ప్రభుత్వంలోని అధికారులను చంపడమే తన లక్ష్యమని పేర్కొన్నాడు.

అధ్యక్షుడిగా మొదటిసారి ఈ విందుకు హాజరైన ట్రంప్ విషయంలో భద్రతా లోపాలు తలెత్తడంపై చర్చ జరుగుతోంది.భారత ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు ప్రపంచ నాయకులు ఈ దాడిని ఖండించారు.

 

Follow us on , &

ఇవీ చదవండి