Breaking News

బెంగళూరులో ఐసోలేషన్‌లో ఉంచబడిన ఉగాండా మహిళకు నిర్వహించిన ఎబోలా పరీక్షల్లో నెగటివ్ అని తేలింది

బెంగళూరులో ఐసోలేషన్‌లో ఉంచబడిన ఉగాండా మహిళకు నిర్వహించిన ఎబోలా పరీక్షల్లో నెగటివ్ అని తేలింది. భారతదేశంలో ఇప్పటివరకు ఎలాంటి ఎబోలా కేసులు నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారికంగా స్పష్టం చేసింది.


Published on: 27 May 2026 12:19  IST

బెంగళూరులో ఐసోలేషన్‌లో ఉంచబడిన ఉగాండా మహిళకు నిర్వహించిన ఎబోలా పరీక్షల్లో నెగటివ్ అని తేలింది. భారతదేశంలో ఇప్పటివరకు ఎలాంటి ఎబోలా కేసులు నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారికంగా స్పష్టం చేసింది. ఉగాండా రాజధాని కంపాలాకు చెందిన 28 ఏళ్ల నానిరే లతీఫా అనే మహిళ మే 23న అహ్మదాబాద్ మీదుగా బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు.

విమానాశ్రయంలో స్క్రీనింగ్ సమయంలో ఆమె తీవ్రమైన అలసట మరియు ఒళ్లు నొప్పులు వంటి స్వల్ప లక్షణాలతో బాధపడుతున్నట్లు అధికారులు గుర్తించారు.ఆమెకు ఎబోలాకు ఉండే ప్రధాన లక్షణమైన తీవ్రమైన జ్వరం వంటివి లేనప్పటికీ, ఆఫ్రికాలో ఎబోలా వ్యాప్తి ఎక్కువగా ఉన్నందున ముందుజాగ్రత్త చర్యగా ఆమెను ఐసోలేషన్‌కు తరలించారు.

ఆమెను మొదట బస చేసిన హోటల్ రూమ్ నుండి ఇందిరానగర్‌లోని ఎపిడెమిక్ డిసీజెస్ ఆసుపత్రికి తరలించి ప్రత్యేక నిఘాలో ఉంచారు.ఆమె రక్తం మరియు ఇతర నమూనాలను సేకరించి పుణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ల్యాబ్‌కు పరీక్షల కోసం పంపించారు.తాజా నివేదికల ప్రకారం ఈ పరీక్షల్లో ఆమెకు ఎబోలా నెగటివ్‌గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉంది.

ప్రస్తుతం ఆఫ్రికా దేశాలైన కాంగో, ఉగాండాలలో ఎబోలా కొత్త స్ట్రెయిన్ వ్యాప్తి చెందుతుండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ అంతర్జాతీయ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే భారత ప్రభుత్వం కూడా విమానాశ్రయాల్లో కఠినమైన నిఘా మరియు స్క్రీనింగ్ చర్యలు చేపట్టింది. ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు సూచించారు.

Follow us on , &

ఇవీ చదవండి