Breaking News

జమ్మూ కశ్మీర్‌లో గత 30 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ఒక్క ఉగ్రవాద దాడి కూడా నమోదు కాని తొలి నెలగా అధికారులు మే నెలను ‘టెర్రర్ ఫ్రీ మంత్’ గా గుర్తించారు.

జమ్మూ కశ్మీర్‌లో గత 30 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా మే 2026 మాసం ఒక చారిత్రాత్మక మైలురాయిని సాధించింది.


Published on: 01 Jun 2026 18:15  IST

జమ్మూ కశ్మీర్లో గత 30 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా మే 2026 మాసం ఒక చారిత్రాత్మక మైలురాయిని సాధించింది. లోయలో ఉగ్రవాదం తీవ్రరూపం దాల్చిన గత మూడు దశాబ్దాల కాలంలో, ఒక్క ఉగ్రవాద దాడి లేదా ఉగ్రవాద సంబంధిత మరణం (Fatality) కూడా నమోదు కాని తొలి నెలగా అధికారులు దీనిని ‘టెర్రర్ ఫ్రీ మంత్’ గా గుర్తించారు.

2026 మే నెలలో జమ్మూ కశ్మీర్‌లో ఎలాంటి ప్రాణనష్టం లేదా చొరబాటు ప్రయత్నాలు జరగలేదు.సౌత్ ఆసియా టెర్రరిజం పోర్టల్ (SATP) గణాంకాల ప్రకారం ఈ ఏడాది ఇప్పటివరకు కేవలం 12 మరణాలు మాత్రమే నమోదయ్యాయి (10 మంది ఉగ్రవాదులు, ఒక జవాన్, ఒకరు గుర్తుతెలియని వ్యక్తి).అత్యంత ప్రాధాన్యత కలిగిన విషయం ఏమిటంటే, ఈ ఏడాది గడిచిన ఐదు నెలల్లో ఒక్క సామాన్య పౌరుడు (Civilian) కూడా ఉగ్రవాద దాడుల వల్ల ప్రాణాలు కోల్పోలేదు.2001లో గరిష్టంగా 1,024 మంది పౌరులు, 628 మంది భద్రతా సిబ్బంది మరణించగా, ప్రస్తుతం భద్రతా బలగాల పటిష్ట వ్యూహాల వల్ల హింస పూర్తిగా అదుపులోకి వచ్చింది.

 

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement