Breaking News

కొండాపూర్‌లో ఉన్న ప్రముఖ జాయకా ఫుడ్ కోర్ట్ పై సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC) టాస్క్‌ఫోర్స్ ఫుడ్ సేఫ్టీ అధికారులు మెరుపు దాడుల హోటల్‌ సీజ్

హైదరాబాద్ ఐటీ కారిడార్ పరిధిలోని కొండాపూర్‌లో ఉన్న ప్రముఖ జాయకా ఫుడ్ కోర్ట్ పై సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC) టాస్క్‌ఫోర్స్ ఫుడ్ సేఫ్టీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించి, తీవ్రమైన నిబంధనల ఉల్లంఘనల కారణంగా దాని FSSAI ఫుడ్ లైసెన్స్‌ను సస్పెండ్ చేసి, హోటల్‌ను సీజ్ చేశారు.


Published on: 25 Jun 2026 19:56  IST

హైదరాబాద్ ఐటీ కారిడార్ పరిధిలోని కొండాపూర్‌లో ఉన్న ప్రముఖ జాయకా ఫుడ్ కోర్ట్ పై సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC) టాస్క్‌ఫోర్స్ ఫుడ్ సేఫ్టీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించి, తీవ్రమైన నిబంధనల ఉల్లంఘనల కారణంగా దాని FSSAI ఫుడ్ లైసెన్స్ను సస్పెండ్ చేసి, హోటల్ను సీజ్ చేశారు. కస్టమర్ ఒకరు హోటల్‌లో ఎలుకలు తిరుగుతున్న వీడియోను ఆధారాలతో సహా సోషల్ మీడియాలో ఫిర్యాదు చేయడంతో అధికారులు ఈ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.

ప్రధాన ఉల్లంఘనలు

ఎలుకల సంచారం: కస్టమర్లకు సర్వ్ చేసే షావార్మా కౌంటర్ పరిసరాల్లో, కిచెన్ ఏరియాలో ఎలుకలు విచ్చలవిడిగా తిరగడం అధికారులు గమనించారు. స్టోరేజ్ రూమ్‌లో ఎలుకల విసర్జనలు మరియు ఎలుకలు కొరికిన ఫుడ్ ప్యాకెట్లు లభ్యమయ్యాయి.

పాడైపోయిన ఆహారం: నిల్వ ఉంచిన చికెన్ బిర్యానీ, కుళ్ళిపోయిన కూరగాయలు ఫ్రీజర్‌లో లభించాయి. ఎగ్‌ మేయోనైజ్ ను కూడా అత్యంత అపరిశుభ్రమైన వాతావరణంలో నిల్వ చేశారు.

పనిచేయని ఫ్రీజర్లు: ఆహార పదార్థాలను నిల్వ ఉంచిన ఫ్రీజర్ పనిచేయకపోవడంతో లోపల ఉన్న ఆహారం పూర్తిగా పాడైపోయింది.

నిర్వహణ లోపం: శాకాహార (Veg), మాంసాహార (Non-Veg) పదార్థాలను విడివిడిగా ఉంచకుండా ఒకే దగ్గర కలగాపులగంగా నిల్వ చేశారు.

తీసుకున్న చర్యలు

లైసెన్స్ రద్దు: జాయకా ఫుడ్ కోర్ట్ యొక్క FSSAI లైసెన్స్‌ను అధికారులు తక్షణమే సస్పెండ్ చేశారు.

హోటల్ సీజ్: తదుపరి ఆదేశాలు వచ్చే వరకు సదరు హోటల్‌ను పూర్తిగా మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు.

కండిషన్స్: హోటల్ యాజమాన్యం తమ లోపాలను సరిదిద్దుకుని, కిచెన్‌ను పూర్తిగా శుభ్రం చేసి, అధికారులు మళ్లీ రీ-ఇన్‌స్పెక్షన్ చేసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేంతవరకు హోటల్ తెరవడానికి వీల్లేదని స్పష్టం చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement