Breaking News

భద్రతా కారణాల దృష్ట్యా దిల్లీలోని 16 కీలక మెట్రో స్టేషన్లను ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) తాత్కాలికంగా మూసివేసింది.

భద్రతా కారణాల దృష్ట్యా దిల్లీలోని 16 కీలక మెట్రో స్టేషన్లను ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) తాత్కాలికంగా మూసివేసింది. నీట్ (NEET-UG) పేపర్ లీక్ వివాదంపై కాక్‌రోచ్ జనతా పార్టీ (CJP) మరియు విద్యార్థి సంఘాలు జంతర్ మంతర్ వద్ద చేపట్టిన నిరసనలు, పార్లమెంట్ వైపు మార్చ్ పిలుపు నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.


Published on: 22 Jul 2026 17:13  IST

భద్రతా కారణాల దృష్ట్యా దిల్లీలోని 16 కీలక మెట్రో స్టేషన్లను ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) తాత్కాలికంగా మూసివేసింది. నీట్ పేపర్ లీక్ వివాదంపై కాక్‌రోచ్ జనతా పార్టీ , విద్యార్థి సంఘాలు జంతర్ మంతర్ వద్ద చేపట్టిన నిరసనలు, పార్లమెంట్ వైపు మార్చ్ పిలుపు నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఈ మెట్రో స్టేషన్లలో ప్రయాణికుల ఎంట్రీ, ఎగ్జిట్‌లను తదుపరి ఆదేశాలు వచ్చే వరకు నిలిపివేశారు. అయితే ప్రయాణికుల సౌకర్యార్థం రాజీవ్ చౌక్, సెంట్రల్ సెక్రటేరియట్, మండీ హౌస్ స్టేషన్లలో కేవలం రైళ్లు మారే (ఇంటర్‌ఛేంజ్) సదుపాయాన్ని మాత్రం కొనసాగిస్తున్నారు.

మూసివేసిన 16 మెట్రో స్టేషన్ల జాబితా:

రాజీవ్ చౌక్

సెంట్రల్ సెక్రటేరియట్

మండీ హౌస్

పటేల్ చౌక్

లోక్ కల్యాణ్ మార్గ్

జన్‌పథ్

ఐటీఓ

ఖాన్ మార్కెట్

సుప్రీంకోర్టు

బరాఖంబా రోడ్

రామకృష్ణ ఆశ్రమ్ మార్గ్

ఢిల్లీ గేట్

ఇంద్రప్రస్థ

జోర్ బాగ్

శివాజీ స్టేడియం

సేవా తీర్థ్  

దిల్లీ మెట్రో ప్రయాణికులు తమ ప్రయాణాన్ని ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్లాన్ చేసుకోవాల్సిందిగా అధికారులు సూచించారు.

Follow us on , &

ఇవీ చదవండి