Breaking News

కాంగో నదిలో రెండు మోటారు పడవలు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో కనీసం 30 మంది ప్రాణాలు కోల్పోయారు

ఆఫ్రికా ఖండంలోని డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో (DRC) లో ఘోర పడవ ప్రమాదం జరిగింది. కాంగో నదిలో రెండు మోటారు పడవలు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో కనీసం 30 మంది ప్రాణాలు కోల్పోయారు, అలాగే డజన్ల సంఖ్యలో ప్రయాణికులు గల్లంతయ్యారు.


Published on: 06 Oct 2026 11:14  IST

ఆఫ్రికా ఖండంలోని డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో (DRC) లో ఘోర పడవ ప్రమాదం జరిగింది. కాంగో నదిలో రెండు మోటారు పడవలు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో కనీసం 30 మంది ప్రాణాలు కోల్పోయారు, అలాగే డజన్ల సంఖ్యలో ప్రయాణికులు గల్లంతయ్యారు.

ఈ ఘోర దుర్ఘటన ఈక్వటోరియల్ ప్రావిన్స్‌లోని న్గోంబే-లుకోలెలా  ప్రాంత సమీపంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. రాత్రి వేళల్లో పడవల ప్రయాణాల వల్ల సాధారణంగా ఇలాంటి ప్రమాదాలు జరుగుతుంటాయని ప్రావిన్షియల్ అంతర్గత వ్యవహారాల మంత్రి క్రిస్పిన్ మ్పుటు తెలిపారు.

రెండు చెక్క పడవలు ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి. అందులో ఒక పడవ వాయువ్యంలోని ఉబాంగి నుంచి దేశ రాజధాని కిన్షాసాకు వెళ్తుండగా, మరో పడవ కిన్షాసా నుంచి లుకోలెలాకు వెళ్తోంది. ఉబాంగి నుంచి వస్తున్న పడవలో సామర్థ్యానికి మించి సరుకులు, ప్రయాణికులు (ఓవర్‌ లోడింగ్) ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

సహాయక చర్యలు: ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక రెస్క్యూ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి. నదిలో ప్రవాహం వేగంగా ఉండటంతో గల్లంతైన వారి ఆచూకీ కనుగొనడం సవాలుగా మారింది. ప్రమాదంలో మరణించిన 30 మందికి ఇప్పటికే స్థానికంగా అంత్యక్రియలు నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు.

కాంగో నదిలో సరైన భద్రతా ప్రమాణాలు లేకపోవడం, లైఫ్ జాకెట్లు వాడకపోవడం మరియు పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించడం వల్ల అక్కడ తరచూ ఇలాంటి పడవ ప్రమాదాలు జరుగుతుంటాయి.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement