Breaking News

అభిమానులు ఎవరూ హాస్పిటల్‌కు రావొద్దు : ఎమ్మెల్యే హరీశ్‌ రావు

బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ను పరామర్శించేందుకు ఎవరూ హాస్పిటల్‌ రావొద్దని అభిమానులకు ఎమ్మెల్యే హరీశ్‌ రావు విజ్ఞప్తి చేశారు. సీఎం కేసీఆర్‌ ఆరోగ్యం నిలకడగానే ఉందని అభిమానులు ఆందోళన చెందవద్దన్నారు. కాగా, కేసీఆర్‌ను పరిశీలించిన వైద్యులు తుంటి ఎముక విరిగినట్లు గుర్తించారు. దీంతో ఐసీయూకి తరలించి చికిత్స అందిస్తున్నారు.


Published on: 08 Dec 2023 14:25  IST

బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ను పరామర్శించేందుకు ఎవరూ హాస్పిటల్‌ రావొద్దని అభిమానులకు ఎమ్మెల్యే హరీశ్‌ రావు విజ్ఞప్తి చేశారు. సీఎం కేసీఆర్‌ ఆరోగ్యం నిలకడగానే ఉందని అభిమానులు ఆందోళన చెందవద్దన్నారు. కాగా, కేసీఆర్‌ను పరిశీలించిన వైద్యులు తుంటి ఎముక విరిగినట్లు గుర్తించారు. దీంతో ఐసీయూకి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. శుక్రవారం సాయంత్రం కేసీఆర్‌కు హిప్‌ రీప్లేస్‌మెంట్‌ సర్జరీ చేయనున్నారు. కేసీఆర్‌ కోలుకోవడానికి ఆరు నుంచి ఎనిమిది వారాలు పడుతుందని హరీశ్ రావు తెలిపారు.

 

Follow us on , &

ఇవీ చదవండి