Breaking News

నరేంద్ర మోదీ 40 సంవత్సరాల భారతదేశ రాజకీయ ప్రస్థానంలో తన ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్నారు.

నరేంద్ర మోదీ 40 సంవత్సరాల భారతదేశ రాజకీయ ప్రస్థానంలో తన ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్నారు.


Published on: 17 Sep 2025 10:08  IST

నరేంద్ర మోదీని భారత ప్రజలు విభిన్నంగా చూస్తున్నారు. కొంత మంది ఆయనను దేశభక్తిగా, ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలూ పనిచేసే నాయకుడిగా భావిస్తారు. మరికొందరు ఆయన నిర్ణయాలను విమర్శిస్తూ ప్రజల మధ్య విభజన పెంచుతారని, దేశ అభివృద్ధిని నిలిపేస్తారని, అనేక తప్పుడు నిర్ణయాలు తీసుకుని దేశాన్ని వెనక్కి నడిపిస్తున్నారని పేర్కొంటున్నారు.

నరేంద్ర మోదీ 1950లో గుజరాత్‌ వాద్‌నగర్‌లో జన్మించారు. చిన్నప్పటి నుంచే తండ్రితో పాటు చాయ్ అమ్మడం ద్వారా జీవితం ప్రారంభించారు. 15 సంవత్సరాల పాటు సంస్కార సంస్థల్లో వివిధ బాధ్యతలు చేపట్టి తర్వాత 1987లో బీజేపీ గుజరాత్‌ యూనిట్‌లో ప్రధాన కార్యదర్శిగా చేరారు. ఆయన పటుత్వంతో గుజరాత్‌లో పార్టీ బలవంతమైనదిగా మారింది. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలలో BJPకి అధిక సీట్లు వచ్చాయని ఆయన పాత్ర కీలకం.

గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి మోదీ గుజరాత్‌ను పారిశ్రామిక, ఆర్థిక మోడల్‌గా ప్రపంచానికి పరిచయం చేశారు. 13 సంవత్సరాల పాలనలో బలమైన పారిశ్రామిక, ఆర్థిక వ్యవస్థను రూపొందించారు. ఆయన BJPలో వాజ్‌పేయి, ఆడ్వాణీ తర్వాత వేగంగా ఎదిగిన నాయకుడిగా గుర్తింపు పొందారు. పార్టీకి జాతీయస్థాయిలో స్టార్ క్యాంపెయినర్‌గా సేవలు అందించారు. 2014లో దేశ ప్రధాని పదవికి వచ్చిన తర్వాత BJP తొలి సారిగా పూర్తి మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. 2019, 2024లో కూడా ఘన విజయం సాధించారు. ఆయన నాయకత్వంలో BJP దాదాపు 18 రాష్ట్రాలలో ప్రభుత్వాలను ఏర్పాటు చేయడమే కాకుండా, మొత్తం 21 రాష్ట్రాలలో ఎన్డీయే కూటమి ద్వారా శక్తివంతమైన ప్రాజెక్టులు చేపట్టింది.

అయితే, మోదీ నాయకత్వంలో పలు విమర్శలు కూడా ఎదురయ్యాయి. ముఖ్యంగా గుజరాత్ అల్లర్లు, పెద్ద నోట్ల రద్దు, సాగుచట్టాలు, లాక్‌డౌన్ సమయంలో పేదల మరణాలు, పౌరసత్వ చట్టంపై జరిగిన నిరసనలు, మణిపూర్ హింసాకాండ, రాఫెల్ యుద్ధవిమాన కొనుగోలు వివాదం, ప్రతిపక్షాలను బలహీనపరిచే చర్యలు, దేశ రాజకీయాల్లో కొన్ని అప్రజాస్వామిక వైఖరి కనిపించడం వంటి అంశాలు ఆయనకు తీవ్ర విమర్శలు తెచ్చిపెట్టాయి. పుల్వామా, పహల్గాం ఉగ్రదాడులు, ఆపరేషన్‌ సిందూర్ వంటి ఘట్టాలు కూడా ఆయనను ప్రశ్నార్థక నాయకుడిగా తీర్పుగా నిలిపాయి.

అయితే, మోదీ తలపెట్టిన పథకాలు దేశ అభివృద్ధికి విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాయి. జన్‌ధన్‌ యోజనతో దేశవ్యాప్తంగా 51 కోట్ల మందికి బ్యాంకు ఖాతాలు తెరిపించటం, ఉజ్వల యోజన ద్వారా 10 కోట్ల మందికి ఉచిత వంట గ్యాస్ కనెక్షన్లు అందించడం, ఆవాస్‌ యోజనతో 4.2 కోట్ల ఇళ్ల నిర్మాణానికి అనుమతులు ఇవ్వడం, మేకిన్‌ ఇండియా కార్యక్రమం ద్వారా దేశాన్ని అంతర్జాతీయ తయారీ కేంద్రంగా తీర్చిదిద్దడం, జీఎస్టీ ప్రవేశపెట్టి ‘ఒకే దేశం- ఒకే పన్ను’ కలను సాకారం చేయడం, జమ్మూ-కశ్మీర్‌కు స్వయం ప్రాతిపత్యాన్ని కల్పించే ఆర్టికల్‌ 370ను రద్దు చేయడం, పౌరసత్వ సవరణ చట్టం ప్రవేశపెట్టి కొన్ని వర్గాలకు ప్రత్యేక హక్కులు కల్పించడం ఆయన సాహసోపేత నిర్ణయాలుగా నిలిచాయి. అంతే కాకుండా ప్రజలకు నేరుగా ప్రయోజనాలు అందించడానికి కిసాన్‌ సమ్మాన్‌ నిధి ద్వారా ఏటా రూ.6 వేల ఇవ్వడం, అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రకటించడం ద్వారా ప్రపంచ స్థాయిలో భారత ప్రతిష్ఠ పెంచడం కూడా ఆయన పాలనలో జరిగిన కీలక చర్యలు.

ప్రస్తుతానికి నరేంద్ర మోదీ 76వ వయసులోకి అడుగుపెట్టారు. దేశంలోని రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాల్లో ఆయన ముద్రను చాలా మంది గుర్తిస్తూ ఉండగా, మరికొంత మంది విమర్శలను కొనసాగిస్తున్నారు. అయినప్పటికీ, కేంద్ర ప్రభుత్వం సకాలంలో చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, వ్యూహాత్మక నిర్ణయాలు దేశ అభివృద్ధికి స్ఫూర్తిగా నిలవాలని ఆశిస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి