Breaking News

అయోధ్యలో 60 మంది మహిళల మంగళ సూత్రాలు మాయం,, దొంగలకు అవకాశంగా మారాయా?

అయోధ్య రామ మందిరంలో బాలరాముడు కొలువుదీరిన నేపథ్యంలో రామ్‌ లల్లాను దర్శించుకునేందుకు భక్తులు వేల సంఖ్యలో తరలివస్తున్నారు. ఇదే అదునుగా భావించిన దొంగలు రెచ్చిపోతున్నారు. భక్తుల నుంచి నగదు, బంగారం, విలువైన వస్తువులను ఎత్తుకెళ్తున్నారు. ఇప్పటి వరకు 60 మంది మహిళల మంగళ సూత్రాలు కాజేసినట్లు పోలీసులకు ఫిర్యాదు అందాయి. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Published on: 12 Feb 2024 15:54  IST

అయోధ్య లో పర్యాటకుల రద్దీని అవకాశంగా తీసుకుంటూ దొంగలు రెచ్చిపోతున్నారు. కరీంనగర్‌కు చెందిన కొందరు భక్తులు ఇటీవల రామ్‌ లల్లాను దర్శించుకునేందుకు అయోధ్య కు వెళ్లగా వారిలోని ఓ మహిళ వద్ద బంగారాన్ని దొంగలు చోరీ చేశారు. రామ మందిర ప్రారంభోత్సవం తరువాత భద్రతా ఏర్పాట్లు కాస్తంత సడలించడంతో దొంగలు రెచ్చిపోతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అక్కడి పలు ప్రాంతాల్లో సీసీ కెమెరాలు  తొలగించడం కూడా దొంగలకు అవకాశంగా మారినట్టు తెలుస్తోంది. 
మరో వైపు అయోధ్య రైల్వేస్టేషన్​లో దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన రుచికరమైన వంటకాలను పర్యాటకులకు అందుబాటులో ఉంచనున్న ఐఆర్​టీసీ. రాష్ట్రాల వారీగా ఫుడ్ ప్లాజాలను ఏర్పాటు చేయనుంది. ఉత్తరం నుంచి దక్షిణం వరకు, తూర్పు నుంచి పడమర వరకు ఏ రాష్ట్రానికి చెందిన పర్యటకులైనా తమ వంటకాలను ఆస్వాదించగలిగేలా చర్యలు చేపడుతుంది.
 

Follow us on , &

ఇవీ చదవండి