Breaking News

హైదరాబాద్ ఎంఎంటీఎస్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్

హైదరాబాద్ ఎంఎంటీఎస్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్. నగరంలో మరో రెండు లైన్లలో ఎంఎంటీఎస్ ట్రైన్లు అందుబాటులో కి రానున్నాయి. సనత్‌నగర్‌ - మౌలాలి మధ్య పరుగులు పెట్టనున్న ఈ ట్రైన్లతో ప్రయాణికుల ఇబ్బందులు తీరనున్నారు. రూ. 5 టికెట్‌తో హైస్పీడ్ జర్నీ అందుబాటులోకి రానుంది.


Published on: 12 Feb 2024 16:35  IST

హైదరాబాద్ నగరంలో చాలా మంది ఎంఎంటీఎస్ ట్రైన్లలో ప్రయాణాలు సాగిస్తుంటారు. మెట్రో అందుబాటులోకి లేని ప్రాంతాల్లో నగరం ఒక మూల నుంచి మరో మూలకు చేరుకునేందుకు ఎంఎంటీఎస్ ట్రైన్లు ఉపయోగపడతాయి. ప్రభుత్వ ఉద్యోగులు, ఐటీ సెక్టార్‌లో పని చేసేవారు, విద్యార్థులు, రోజూ కూలీలు ఇలా చాలా మంది ఎంఎంటీఎస్ ట్రైన్లలో ప్రయాణాలు సాగిస్తుంటారు. వారందరికీ ఇది  శుభవార్తే, ఎందుకుంటే.. ఎంఎంటీఎస్‌  ట్రైన్ల రెండో దశ పనులు మొత్తం పూర్తి కాగా, సనత్‌నగర్‌ - మౌలాలి మధ్య ఎంఎంటీఎస్‌ రెండో లైను రెడీ అయింది. రక్షణశాఖ - రైల్వే శాఖల మధ్య రెండో లైను నిర్మాణానికి ఉన్న ఆటంకాలు తొలగడంతో పనులు వేగంగా పూర్తి చేసారు. రెండో దశలో భాగంగా మొత్తం 95 కిలోమీటర్ల మేర లైన్లు వేయడం, విద్యుదీకరణ, స్టేషన్ల నిర్మాణం పూర్తయ్యాయి.

చర్లపల్లి రైల్వే స్టేషన్‌ ప్రారంభోత్సవానికి మార్చి మొదటి వారం లో ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ రానున్నారు. అదే రోజున సనత్‌నగర్‌ - మౌలాలి మధ్య మొత్తం 22 కిలోమీటర్ల మేర రెండో దశ ఎంఎంటీఎస్‌ ట్రైన్లను కూడా ఆయన ప్రారంభించనున్నారు. చర్లపల్లి స్టేషన్‌ ప్రారంభమయ్యాక అక్కడి నుంచి 25 ప్యాసింజర్ ట్రైన్లు దూర ప్రాంతాలకు రాకపోకలు సాగించనున్నాయి. 
ఎంఎంటీఎస్‌ రెండో దశ సనత్‌నగర్‌- మౌలాలి, హైటెక్‌సిటీ మీదుగా లింగంపల్లి అందుబాటులోకి రానుంది. దీంతో ఈ రూట్లలో ప్రయాణాలు సాగించే ఐటీ ఉద్యోగులు గమ్యస్థానాలకు చేరుకోవచ్చు. అత్యంత రద్దీగా మారిన సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌తో సంబంధం లేకుండా నేరుగా మౌలాలి నుంచి హైటెక్‌సిటీకి ఎంఎంటీఎస్‌ ట్రైన్లు  అందుబాటులోకి రానున్నాయి. సనత్‌నగర్‌-మౌలాలి  మధ్య మొత్తం 22 కి.మీ. మేర 6 స్టేషన్లు అదనంగా అందుబాటులోకి రానున్నాయి. వీటి పరిధిలో ఉన్న కాలనీలు, బస్తీలకు కేవలం రూ. 5 టిక్కెట్‌ తో హై స్పీడ్ జర్నీ అందుబాటులోకి రానుంది.
 

Follow us on , &

ఇవీ చదవండి