Breaking News

ఎస్‌బీఐకి అంతర్జాతీయ గౌరవం – రెండు ప్రతిష్టాత్మక అవార్డులు సాధన

ఎస్‌బీఐకి అంతర్జాతీయ గౌరవం – రెండు ప్రతిష్టాత్మక అవార్డులు సాధన


Published on: 24 Oct 2025 16:10  IST

దేశంలోని అగ్ర బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) మరోసారి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. అమెరికాలోని గ్లోబల్ ఫైనాన్స్ సంస్థ నుంచి ఎస్‌బీఐకి రెండు ప్రతిష్టాత్మక అవార్డులు లభించాయి. ఇవి వరల్డ్ బ్యాంక్/ఐఎంఎఫ్ వార్షిక సమావేశాల సందర్భంగా ప్రత్యేక కార్యక్రమంలో అందజేశారు.

ఎస్‌బీఐ “వరల్డ్ బెస్ట్ కన్స్యూమర్ బ్యాంక్ 2025”, “ఇండియా బెస్ట్ బ్యాంక్ 2025” అనే రెండు ప్రధాన అవార్డులను గెలుచుకుంది. కస్టమర్లకు నాణ్యమైన సేవలు, సాంకేతికత ఆధారిత సౌకర్యాలు అందించడంలో ఎస్‌బీఐ చూపుతున్న కృషికి ఇది ప్రతిఫలమని బ్యాంక్ తెలిపింది.

ఎస్‌బీఐ చైర్మన్ సీ.ఎస్. శెట్టి మాట్లాడుతూ – ప్రస్తుతం 52 కోట్ల కస్టమర్లకు సేవలు అందిస్తున్నామని, రోజుకు 65 వేల మంది కొత్త ఖాతాదారులు ఎస్‌బీఐలో చేరుతున్నారని తెలిపారు.

ఈ విజయంపై కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ కూడా సోషల్ మీడియా ద్వారా అభినందనలు తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి