Breaking News

'విలువల విద్య' సదస్సులో ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మరియు ప్రముఖ ప్రవచనకర్త, ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావు పాల్గొన్నారు. 

విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో 2025 నవంబర్ 24వ తేదీన జరిగిన 'విలువల విద్య' సదస్సులో ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మరియు ప్రముఖ ప్రవచనకర్త, ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావు పాల్గొన్నారు. 

Published on: 24 Nov 2025 18:30  IST

విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో 2025 నవంబర్ 24వ తేదీన జరిగిన 'విలువల విద్య' సదస్సులో ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మరియు ప్రముఖ ప్రవచనకర్త, ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావు పాల్గొన్నారు. 

పిల్లలకు నైతిక విలువలు, సమాజంలో మార్పు రావాలంటే ముందు ఇంట్లో నుంచే మొదలవ్వాలని మంత్రి లోకేష్ ఉద్ఘాటించారు.విలువలతో కూడిన విద్య అందించే పవిత్ర బాధ్యతకు సలహాదారుగా చాగంటి కోటేశ్వరరావును నియమించినట్లు లోకేష్ తెలిపారు. ఆయన మార్గదర్శకత్వంలో పాఠ్యపుస్తకాలు, డిజిటల్ కంటెంట్ రూపొందిస్తున్నామని పేర్కొన్నారు.విద్యార్థుల భవిష్యత్తు కోసం చాగంటి రూపొందించిన పుస్తకాలను వారికి అందిస్తున్నామని మంత్రి తెలిపారు.మహిళలను గౌరవించినప్పుడే సమాజం బాగుంటుందని, ఈ విషయాన్ని విద్యా వ్యవస్థలో భాగం చేయాలని లోకేష్ సూచించారు.ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపరచడమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యమని ఆయన పునరుద్ఘాటించారు. 

Follow us on , &

ఇవీ చదవండి