Breaking News

నేడు ఏపీ పీజీసెట్‌ 2026 ఫలితాలు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ ఎక్స్‌’ వేదికగా వెల్లడించారు.

ఏపీ పీజీసెట్‌ (AP PGCET 2026) ఫలితాలు నేడు, మే 29, 2026న అధికారికంగా విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ ఈ ఫలితాలను ‘ఎక్స్‌’ (ట్విట్టర్) వేదికగా వెల్లడించారు.


Published on: 29 May 2026 19:32  IST

ఏపీ పీజీసెట్‌ (AP PGCET 2026) ఫలితాలు నేడు, మే 29, 2026 అధికారికంగా విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఈ ఫలితాలను ‘ఎక్స్‌’ (ట్విట్టర్) వేదికగా వెల్లడించారు. ఈ ఏడాది పరీక్షల్లో మొత్తం 91.55 శాతం మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు.

అభ్యర్థులు APSCHE APPGCET అధికారిక పోర్టల్ ను సందర్శించాలి.హోమ్‌పేజీలో ఉన్న 'Download Rank Card' లింక్‌పై క్లిక్ చేయాలి.మీ అప్లికేషన్ నంబర్, హాల్ టికెట్ నంబర్, మరియు పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసి లాగిన్ అవ్వాలి.మీ ర్యాంక్ కార్డ్ స్క్రీన్‌పై కనిపిస్తుంది, దానిని ప్రింట్ లేదా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

వాట్సాప్ (WhatsApp) ద్వారా

ఈసారి విద్యార్థుల సౌకర్యార్థం వాట్సాప్ ద్వారా కూడా ఫలితాలను పొందే వీలు కల్పించారు.

అభ్యర్థులు 95523 00009 అనే అధికారిక వాట్సాప్ నంబర్‌కు సందేశం పంపడం ద్వారా తమ ర్యాంకు వివరాలను సులభంగా తెలుసుకోవచ్చు.

ముఖ్యమైన గణాంకాలు

మొత్తం దరఖాస్తుదారులు: 19,118 మంది

పరీక్షకు హాజరైన వారు: 16,406 మంది

ఉత్తీర్ణత సాధించిన వారు: 15,020 మంది

మొత్తం ఉత్తీర్ణత శాతం: 91.55%

ఈ ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు త్వరలోనే కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండలి ప్రకటించనుంది.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement