Breaking News

అమెరికా ప్రభుత్వం ఆగస్టు 2026 నుండి H-1B వీసా నిబంధనలను మరింత కఠినతరం చేయడానికి కొత్త ప్రతిపాదనలను సిద్ధం చేసింది

అమెరికా ప్రభుత్వం ఆగస్టు 2026 నుండి H-1B వీసా నిబంధనలను మరింత కఠినతరం చేయడానికి కొత్త ప్రతిపాదనలను సిద్ధం చేసింది. యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ , లేబర్ డిపార్ట్‌మెంట్ విడుదల చేసిన 2026 నియంత్రణ ఎజెండా ప్రకారం ఈ మార్పులు ఉండబోతున్నాయి.


Published on: 10 Jul 2026 12:37  IST

అమెరికా ప్రభుత్వం ఆగస్టు 2026 నుండి H-1B వీసా నిబంధనలను మరింత కఠినతరం చేయడానికి కొత్త ప్రతిపాదనలను సిద్ధం చేసింది. యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ , లేబర్ డిపార్ట్‌మెంట్ విడుదల చేసిన 2026 నియంత్రణ ఎజెండా ప్రకారం ఈ మార్పులు ఉండబోతున్నాయి.

థర్డ్-పార్టీ క్లయింట్ సైట్ ఉద్యోగులపై నిఘా

భారతీయ ఐటీ కంపెనీలు, కన్సల్టెన్సీల ద్వారా థర్డ్-పార్టీ క్లయింట్ ప్రదేశాలలో పనిచేసే ఉద్యోగులపై నియంత్రణ పెరుగుతుంది.

కంపెనీకి, ఉద్యోగికి మధ్య నిజమైన యజమాని-ఉద్యోగి సంబంధం ఉందో లేదో బలమైన ఆధారాలు చూపించాలి.

క్లయింట్ లొకేషన్‌లో చేసే పని ప్రత్యేక నైపుణ్యంతో కూడుకున్నదే అని నిరూపించడానికి మరిన్ని పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది.

వీసా పొడిగింపులకు అదనపు ఫీజు

ప్రస్తుతం కొన్ని పెద్ద కంపెనీలు కొత్త H-1B పిటిషన్లు వేసేటప్పుడు మాత్రమే అదనపు సప్లిమెంటల్ ఫీజు చెల్లిస్తున్నాయి.కానీ ఆగస్టు ప్రతిపాదనల ప్రకారం, ఇకపై H-1B వీసా ఎక్స్‌టెన్షన్ అప్లికేషన్లకు కూడా అదనపు ఫీజు వర్తింపజేయనున్నారు. దీనివల్ల ఐటీ కంపెనీలపై ఆర్థిక భారం పెరుగుతుంది.

క్యాప్ మినహాయింపుల తగ్గింపు

సాధారణంగా విశ్వవిద్యాలయాలు , కొన్ని ప్రభుత్వ పరిశోధనా సంస్థలకు వార్షిక H-1B లిమిట్ (క్యాప్) నుండి మినహాయింపు ఉంటుంది.ఈ ప్రతిపాదన ద్వారా ఆ మినహాయింపుల పరిధిని తగ్గించనున్నారు, దీనివల్ల ఆయా సంస్థల్లో H-1B వీసాలు సాధించడం కష్టతరం అవుతుంది.

గతంలో తప్పులు చేసిన కంపెనీలపై కఠిన నిఘా

గతంలో H-1B వీసా రూల్స్ ఉల్లంఘించిన లేదా మోసాలకు పాల్పడినట్లు రికార్డు ఉన్న కంపెనీల అప్లికేషన్లను USCIS మరింత కఠినంగా స్క్రూటినీ చేస్తుంది.

సంతకాలపై కొత్త రూల్ : USCIS జూలై 10, 2026 నుండి ఒక కొత్త నిబంధనను అమలు చేస్తోంది. దీని ప్రకారం H-1B మరియు గ్రీన్ కార్డ్ అప్లికేషన్లపై కేవలం చేతితో పెట్టిన అసలు సంతకాలు లేదా సరిగ్గా కాపీ చేసిన సంతకాలు మాత్రమే అంగీకరిస్తారు. కంప్యూటర్ ద్వారా ఆటో-జనరేట్ చేసిన లేదా కాపీ-పేస్ట్ చేసిన సంతకాలు ఉంటే అప్లికేషన్లను తిరస్కరిస్తారు.

H-4 EAD ఆటో-ఎక్స్‌టెన్షన్స్ రద్దు: H-1B ఉద్యోగుల జీవిత భాగస్వాములకు ఇచ్చే H-4 వీసా వర్క్ పర్మిట్ (EAD)ల ఆటోమేటిక్ ఎక్స్‌టెన్షన్‌ను కూడా రద్దు చేయాలని చూస్తున్నారు. దీనివల్ల అప్లికేషన్లు ఆలస్యమైతే మధ్యలో ఉద్యోగాలు ఆగిపోయే ప్రమాదం ఉంది.

వేతనాల పెంపు ప్రతిపాదన: H-1B ఉద్యోగుల కనీస వేతనాలను 21% నుండి 33% వరకు పెంచాలని లేబర్ డిపార్ట్‌మెంట్ చూస్తోంది.

Follow us on , &

ఇవీ చదవండి