Breaking News

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారా లోకేష్ మరియు ఏపీకి చెందిన ఎన్డీయే (NDA) కూటమి ఎంపీల బృందం ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు

ఏప్రిల్ 2, 2026న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారా లోకేష్ మరియు ఏపీకి చెందిన ఎన్డీయే (NDA) కూటమి ఎంపీల బృందం ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. 


Published on: 02 Apr 2026 14:30  IST

ఏప్రిల్ 2, 2026న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారా లోకేష్ మరియు ఏపీకి చెందిన ఎన్డీయే (NDA) కూటమి ఎంపీల బృందం ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. 

లోక్‌సభలో అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు, 2026 ఆమోదం పొందిన నేపథ్యంలో, ప్రధానికి వారు కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా మంత్రి లోకేష్ ప్రధానిని శాలువాతో సత్కరించగా, మోదీ ఆయనకు "కంగ్రాట్స్" చెబుతూ ప్రత్యేకంగా అభినందించారు.

లోకేష్‌తో పాటు కేంద్ర మంత్రి కె. రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ మరియు టీడీపీ, జనసేన, బీజేపీకి చెందిన ఇతర ఎంపీలు ఈ భేటీలో పాల్గొన్నారు.ప్రధానితో సమావేశం అనంతరం లోకేష్ బృందం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కూడా కలిసి ధన్యవాదాలు తెలిపారు.ఈ బిల్లు రాజ్యసభలో ప్రవేశపెట్టనున్న తరుణంలో, ఆ ఆమోద ప్రక్రియను వీక్షించేందుకు లోకేష్ గ్యాలరీలో ఉండనున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి