Breaking News

భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా స్విగ్గీ క్విక్-కామర్స్ యాప్ ద్వారా వంటగ్యాస్ సిలిండర్ల డోర్ స్టెప్ డెలివరీ సేవలను ప్రారంభించాయి.

స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ మరియు హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ భాగస్వామ్యంతో భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా క్విక్-కామర్స్ యాప్ ద్వారా వంటగ్యాస్ సిలిండర్ల డోర్ స్టెప్ డెలివరీ సేవలను ప్రారంభించాయి.


Published on: 16 Jul 2026 11:17  IST

స్విగ్గీ ఇన్స్టామార్ట్ మరియు హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ భాగస్వామ్యంతో భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా క్విక్-కామర్స్ యాప్ ద్వారా వంటగ్యాస్ సిలిండర్ల డోర్ స్టెప్ డెలివరీ సేవలను ప్రారంభించాయి.ఈ సేవలను ప్రస్తుతానికి కేవలం బెంగళూరు నగరంలో మాత్రమే పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభించారు.హైదరాబాద్ లేదా తెలంగాణలోని ఇతర ప్రాంతాలకు ఈ సేవలను త్వరలోనే విస్తరిస్తామని కంపెనీ తెలిపింది.సాధారణంగా ఇళ్లలో వాడే 14.2 కిలోల పెద్ద సిలిండర్లు కాకుండా, చిన్న సైజు సిలిండర్లను స్విగ్గీ ద్వారా అందిస్తున్నారు:

5 కిలోల మెటల్ సిలిండర్.

10 కిలోల కాంపోజిట్ సిలిండర్: ఇది తేలికగా ఉంటుంది మరియు గ్యాస్ ఎంత ఉందో బయటికే కనిపించేలా పారదర్శకంగా ఉంటుంది.

ఈ సిలిండర్లను ఆర్డర్ చేయడానికి వినియోగదారులకు ముందే ఎలాంటి HP గ్యాస్ కనెక్షన్ లేదా అడ్రస్ ప్రూఫ్ పత్రాలు ఉండాల్సిన అవసరం లేదు.రూమ్‌లలో అద్దెకు ఉండే విద్యార్థులు, బ్యాచిలర్స్ మరియు వలస కార్మికులకు ఈ సేవలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి.

ఆర్డర్ మరియు డెలివరీ విధానం

మొదటిసారి కొనుగోలు చేసేటప్పుడు కొత్త సిలిండర్‌గా పరిగణించి, డిజిటల్ ఐడెంటిటీ వెరిఫికేషన్ పూర్తి చేయాల్సి ఉంటుంది.

రీఫిల్లింగ్: ఆ తర్వాత సారి నుండి మీ వద్ద ఉన్న ఖాళీ సిలిండర్‌ను డెలివరీ బాయ్‌కు ఇచ్చి కొత్త రీఫిల్ సిలిండర్ తీసుకోవచ్చు.

భద్రత: ఈ సిలిండర్లను స్విగ్గీ డెలివరీ బాయ్స్ కాకుండా, HPCL కి చెందిన శిక్షణ పొందిన అధికారిక డిస్ట్రిబ్యూటర్ సిబ్బంది మాత్రమే అన్ని భద్రతా ప్రమాణాలతో డెలివరీ చేస్తారు

 

Follow us on , &

ఇవీ చదవండి