Breaking News

కేంద్ర హోంమంత్రి అమిత్ షా భారతదేశం నక్సలిజం నుండి పూర్తిగా విముక్తి పొందుతుందని ప్రకటించారు

కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిర్దేశించుకున్న గడువు ప్రకారం, 31 మార్చి 2026 నాటికి భారతదేశం నక్సలిజం నుండి పూర్తిగా విముక్తి పొందుతుందని ప్రకటించారు.


Published on: 31 Mar 2026 10:15  IST

కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిర్దేశించుకున్న గడువు ప్రకారం, 31 మార్చి 2026 నాటికి భారతదేశం నక్సలిజం నుండి పూర్తిగా విముక్తి పొందుతుందని ప్రకటించారు. ఈ గడువుకు ఒకరోజు ముందుగానే, అంటే 30 మార్చి 2026, లోక్‌సభలో జరిగిన చర్చలో ఆయన ప్రసంగిస్తూ దేశం దాదాపు "నక్సల్ రహితంగా" (Naxal-Free) మారిందని అధికారికంగా ప్రకటించారు. 

గతంలో అమిత్ షా ప్రకటించిన "మిషన్ 2026" లక్ష్యం నెరవేరిందని, ఏప్రిల్ 1, 2026 నుండి భారత్ నక్సల్ రహిత దేశంగా మారుతుందని ఆయన స్పష్టం చేశారు.ఒకప్పుడు నక్సలిజానికి కంచుకోటగా ఉన్న ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతం ఇప్పుడు అభివృద్ధి పథంలో పయనిస్తోందని, తుపాకుల మోత స్థానంలో పాఠశాల గంటలు వినిపిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.

గడిచిన మూడేళ్లలో (2024 నుండి 2026 మార్చి వరకు) భద్రతా బలగాల చర్యల వల్ల 706 మంది నక్సలైట్లు హతమయ్యారని, 2,218 మంది అరెస్టయ్యారని మరియు 4,849 మంది లొంగిపోయారని హోంమంత్రి నివేదిక ఇచ్చారు.2014లో 126 జిల్లాలుగా ఉన్న నక్సల్ ప్రభావిత ప్రాంతాలు ఇప్పుడు కేవలం అతి స్వల్ప స్థాయికి పడిపోయాయని ఆయన వివరించారు.ఆయుధాలు వదిలి లొంగిపోయిన వారితోనే ప్రభుత్వం చర్చలు జరుపుతుందని, హింసను ఎంచుకునే వారికి దీటైన సమాధానం ఉంటుందని ఆయన పునరుద్ఘాటించారు.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement