Breaking News

రెండు స్టేడియంలను జైళ్లుగా మార్చేసిన హరియాణా

వ్యవసాయోత్పత్తుల కనీస మద్దతు ధరకు చట్టబద్దత సహా తమ 20 డిమాండ్‌పై మరోసారి ఫిబ్రవరి 13న వేలాది మంది రైతులు ఢిల్లీని చుట్టుముట్టనున్నారు. పంజాబ్‌, రాజస్థాన్‌,హరియాణా, యూపీ, కేరళ, కర్ణాటక తదితర రాష్ట్రాల నుంచి రైతులు దేశ రాజధానిలో ప్రవేశించనున్నారు. రెండు స్టేడియంలను జైళ్లుగా మార్చేసిన హరియాణా.


Published on: 12 Feb 2024 10:47  IST

పంటలకు మద్దతు ధర సహా తమ డిమాండ్ల సాధన కోసం అన్నదాతలు మంగళవారం "ఛలో ఢిల్లీ" పేరుతో ఆందోళన చేపట్టాలని నిర్ణయించాయి. దీంతో ఢిల్లీ, హర్యానా సరిహద్దు ప్రాంతాల్లో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. పుకార్లు వ్యాప్తి చెందకుండా 3 రోజుల పాటు హరియాణాలోని ఏడు జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు.  పంజాబ్‌తో హరియాణా సరిహద్దులను అంబాలా సమీపంలోని శంభు వద్ద పోలీసులు మూసివేశారు. 
రహదారిపై ముళ్ల కంచెలు, ఇసుక బస్తాలు, కాంక్రీటు దిమ్మెలను అడ్డుగా ఉంచారు.
అత్యవసరమైతే తప్ప ప్రధాన రోడ్లపై ప్రయాణించవద్దని ప్రజలకు హరియాణా ప్రభుత్వం సూచించింది,, జింద్‌, ఫతేహాబాద్‌ జిల్లాల్లోనూ రైతుల మార్చ్‌ను అడ్డుకునేలా చర్యలు చేపట్టారు. అంబాలా,  సోనీపట్, ఖైథల్‌, పంచకుల్‌లో 144 సెక్షన్ విధించారు. రైతుల మార్చ్ జరిగితే వారిని అరెస్ట్ చేయడానికి  సిద్ధమయ్యారు, ఇందుకోసం రెండు స్టేడియంలను తాత్కాలిక జైళ్లుగా మార్చారు. దబ్వాలీలోని గురు గోవింద్ సింగ్ స్టేడియం , సిర్సాలోని చౌధరి దల్బీర్ సింగ్ ఇండోర్ స్టేడియాలను  జైళ్లుగా ఉపయోగించుకోనున్నారు.
 

Follow us on , &

ఇవీ చదవండి