Breaking News

ప్రారంభ స్థాయిలోనే రూ.21 లక్షల వేతనం ప్రకటించిన ఇన్ఫోసిస్

ప్రారంభ స్థాయిలోనే రూ.21 లక్షల వేతనం ప్రకటించిన ఇన్ఫోసిస్


Published on: 26 Dec 2025 10:29  IST

భారత ఐటీ రంగంలో ప్రముఖ సంస్థ అయిన ఇన్ఫోసిస్ తాజాగా యువ ఉద్యోగార్థులకు పెద్ద శుభవార్త చెప్పింది. ఆధునిక సాంకేతికత, ముఖ్యంగా కృత్రిమ మేధ (AI), డిజిటల్ టెక్నాలజీల్లో నైపుణ్యం ఉన్న యువతను ఆకర్షించేందుకు, ప్రారంభ స్థాయిలోనే భారీ వేతనాలను ప్రకటించింది. కొన్ని ప్రత్యేక టెక్నాలజీ ఉద్యోగాలకు సంబంధించి ఏటా గరిష్టంగా రూ.21 లక్షల వరకు ప్యాకేజీ ఇవ్వనున్నట్లు సంస్థ వర్గాలు వెల్లడించాయి. భారత ఐటీ కంపెనీల్లో ఫ్రెషర్లకు ఇంత అధిక ప్రారంభ వేతనం ప్రకటించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

త్వరలో ఆఫ్ క్యాంపస్ ఎంపికలు

స్పెషలైజ్డ్ టెక్నాలజీ ఉద్యోగాల కోసం ఇంజినీరింగ్, కంప్యూటర్ గ్రాడ్యుయేట్లకు ఇన్ఫోసిస్ త్వరలో ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ నిర్వహించనుంది. ఈ నియామకాల్లో ఎంపికైన అభ్యర్థులకు వారి నైపుణ్యం, పాత్ర ఆధారంగా రూ.7 లక్షల నుంచి రూ.21 లక్షల వరకు వార్షిక వేతనం అందించనున్నారు. AI, క్లౌడ్, డేటా సైన్స్, డిజిటల్ సిస్టమ్స్ వంటి రంగాల్లో నైపుణ్యం ఉన్నవారికి ఈ అవకాశాలు ప్రధానంగా ఉంటాయి.

ఏ ఉద్యోగాలకు అవకాశం?

ఈ నియామకాల్లో ప్రధానంగా

  • స్పెషలిస్ట్ ప్రోగ్రామర్ (L1 – L3)

  • డిజిటల్ స్పెషలిస్ట్ ఇంజినీర్ (ట్రెయినీ)

వంటి పోస్టులు ఉంటాయి.

అర్హతలు:
బీఈ, బీటెక్, ఎమ్‌ఈ, ఎంటెక్, ఎమ్‌సీఏ, ఇంటిగ్రేటెడ్ ఎమ్‌ఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు.

పాత్రల వారీగా వేతన వివరాలు

ఇన్ఫోసిస్ ప్రకటించిన వేతన నిర్మాణం ఇలా ఉంది

Follow us on , &

ఇవీ చదవండి