Breaking News

ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువతి మక్కెన ప్రసన్న (27) న్యూజెర్సీలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో దుర్మరణం

ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువతి మక్కెన ప్రసన్న (27) న్యూజెర్సీలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు.మంగళవారం ప్రసన్న తన ముగ్గురు స్నేహితులతో కలిసి అద్దె కారులో ఒక కార్యక్రమానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.


Published on: 15 Jul 2026 16:17  IST

ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువతి మక్కెన ప్రసన్న (27) న్యూజెర్సీలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు.మంగళవారం ప్రసన్న తన ముగ్గురు స్నేహితులతో కలిసి అద్దె కారులో ఒక కార్యక్రమానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.వారు ప్రయాణిస్తున్న వాహనం అదుపు తప్పి ఒక చెట్టును బలంగా ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో ప్రసన్న అక్కడికక్కడే మృతి చెందగా, ఆమెతో ఉన్న ముగ్గురు స్నేహితులు తీవ్రంగా గాయపడ్డారు.

పల్నాడు జిల్లా వినుకొండ మండలం ఉమ్మడివరం గ్రామం.రైతు కుటుంబానికి చెందిన మక్కెన వెంకటేశ్వర్లు, గోవిందమ్మ దంపతుల పెద్ద కుమార్తె.2022లో ఉన్నత విద్య (MS) కోసం అమెరికా వెళ్లిన ప్రసన్న, ఇటీవలే చదువు పూర్తి చేసుకుని మంచి కంపెనీలో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు.

స్వగ్రామంలో విషాదం & ప్రభుత్వ సహాయం

ప్రసన్న మరణవార్త తెలియడంతో ఉమ్మడివరం గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు విదేశాల్లో స్థిరపడుతుందని ఆశించిన తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

ఈ విషయం తెలుసుకున్న ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు మృతురాలి తండ్రికి ఫోన్ చేసి పరామర్శించారు.ప్రసన్న భౌతికకాయాన్ని వీలైనంత త్వరగా స్వదేశానికి తీసుకువచ్చేందుకు సంబంధిత అధికారులతో మాట్లాడి తగిన చర్యలు తీసుకుంటామని ఆయన కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు.

 

Follow us on , &

ఇవీ చదవండి