Breaking News

అత్తాపూర్‌లోని రాంబాగ్లో ₹250 కోట్ల విలువైన 2.34 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా

రంగారెడ్డి జిల్లా అత్తాపూర్‌లోని రాంబాగ్ ప్రాంతంలో సుమారు ₹250 కోట్ల విలువైన 2.34 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా (HYDRAA) అధికారులు స్వాధీనం చేసుకుని కాపాడారు.


Published on: 16 Mar 2026 15:59  IST

రంగారెడ్డి జిల్లా అత్తాపూర్‌లోని రాంబాగ్ ప్రాంతంలో సుమారు ₹250 కోట్ల విలువైన 2.34 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా (HYDRAA) అధికారులు స్వాధీనం చేసుకుని కాపాడారు.రాజేంద్రనగర్ మండలం, అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాంబాగ్ శివాలయం సమీపంలో ఉన్న సర్వే నంబర్ 354/1, 354/2, 354/3 లోని 2.34 ఎకరాల భూమి.

ఈ భూమి చుట్టూ సిక్కు కమ్యూనిటీ వారు గతంలో టిన్ షీట్లతో ఫెన్సింగ్ వేసి ఆక్రమణకు ప్రయత్నించారు. స్థానిక ఆలయాలకు ఈ భూమిని కేటాయించాలని ఒక వర్గం, సిక్కు కమ్యూనిటీకి ఇవ్వాలని మరో వర్గం మధ్య చాలా కాలంగా వివాదం నడుస్తోంది.హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాల మేరకు అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి, రెవెన్యూ రికార్డులను పరిశీలించి అది ప్రభుత్వ భూమిగా నిర్ధారించారు.

 భారీ పోలీస్ బందోబస్తు మధ్య అక్రమంగా ఏర్పాటు చేసిన టిన్ షీట్లను, షెడ్లను తొలగించి, భూమి చుట్టూ కొత్తగా ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. ఇది ప్రభుత్వ భూమి అని తెలిపే హెచ్చరిక బోర్డులను కూడా అక్కడ పాతారు.సిక్కు సమాధి ఉన్న 366 గజాల స్థలాన్ని మాత్రం ఎటువంటి ఆటంకం కలిగించకుండా అలాగే వదిలేశారు. 
 

Follow us on , &

ఇవీ చదవండి