Breaking News

జీడిమెట్ల పరిధిలోని వసంత కెమికల్స్ కంపెనీకి చెందిన ఖాళీ స్థలంలో నిల్వ ఉంచిన పాత రియాక్టర్లు పేలడం వల్ల భారీ అగ్నిప్రమాదం సంభవించింది

16 జూన్ 2026 మంగళవారంనాడు హైదరాబాద్‌లోని జీడిమెట్ల పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని వసంత కెమికల్స్ కంపెనీకి చెందిన ఖాళీ స్థలంలో నిల్వ ఉంచిన పాత రియాక్టర్లు పేలడం వల్ల ఈ ప్రమాదం సంభవించింది.

Published on: 16 Jun 2026 15:38  IST

16 జూన్ 2026 మంగళవారంనాడు హైదరాబాద్‌లోని జీడిమెట్ల పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని వసంత కెమికల్స్ కంపెనీకి చెందిన ఖాళీ స్థలంలో నిల్వ ఉంచిన పాత రియాక్టర్లు పేలడం వల్ల ఈ ప్రమాదం సంభవించింది.

జీడిమెట్ల పారిశ్రామిక ప్రాంతంలోని వసంత కెమికల్స్ కంపెనీ ఓపెన్ యార్డ్.ఖాళీ ప్రదేశంలో పడేసిన పాత రియాక్టర్లు ఒక్కసారిగా పేలడంతో మంటలు చెలరేగాయి.ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం గానీ, ఎవరికీ గాయాలు గానీ కాలేదని ప్రాథమిక సమాచారం ద్వారా తెలిసింది.

రియాక్టర్లు పేలడంతో ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా దట్టమైన నల్లటి పొగ కమ్మేసింది. దీంతో ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కార్మికులు, స్థానికులు తీవ్ర భయాందోళనకు గురై ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన కంపెనీ సిబ్బంది ఫైర్ ఎక్స్‌టింగిషర్లు, వాటర్ పైప్‌లైన్ల సహాయంతో మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది (Fire Department) వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు.

Follow us on , &

ఇవీ చదవండి