Breaking News

మధ్యప్రదేశ్ హర్దాలోని బాణాసంచా ఫ్యాక్టరీలో భారీ విధ్వంసం

మధ్యప్రదేశ్: హర్దాలోని బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించిన ఘటనలో 11 మంది మృతి చెందగా, 100 మంది తీవ్రంగా గాయపడ్డారు. అగ్నిప్రమాదంలో ఇళ్లు దగ్ధం, మంటల్లో చిక్కుకున్న పలువురి కార్మికులు. సీఎం కీలక సమావేశం, హెలికాప్టర్ల కోసం ఆర్మీ సంప్రదింపులు.


Published on: 07 Feb 2024 14:19  IST

మధ్యప్రదేశ్‌లోని హర్దాలో  బాణసంచా ఫ్యాక్టరీలో మంగళవారం ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. మంటలు చెలరేగడంతో ఫ్యాక్టరీలో ఒకదాని తరువాత ఒకటి పేలుళ్లు  జరగడం ప్రారంభించాయి. ఈ ఫ్యాక్టరీ చాలా కాలంగా అక్రమంగా నడుస్తోందని స్థానికులు చెబుతున్నారు.
 ఈ ఘటన జరిగిన సమయంలో దాదాపు 150 మంది వరకు ఫ్యాక్టరీలో పని చేస్తున్నట్లు సమాచారం. ఈ పేలుడు శబ్ధం దాదాపు రెండు కిలోమీటర్ల వరకు వినిపించింది. చుట్టుపక్కల 60 ఇళ్లకు మంటలు అంటుకున్నాయి. పేలుడు సమాచారం తెలుసుకున్నా రెస్క్యూ టీమ్‌ హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టింది. ఇప్పటి వరకూ చుట్టు పక్కలా ఉన్నా వానిరి సుమారు 100 ఇళ్లను అధికారులు ఖాళీ చేయించారు. మంటల ధాటికి పలు వాహనాలు పూర్తిగా దగ్దమయ్యాయి. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
 

Follow us on , &

ఇవీ చదవండి