Breaking News

పవన్‌ కల్యాణ్‌ కుమారుడికి చేతులు, కాళ్లకు గాయాలు కావడంతో పాటు, కొంత పొగ ఊపిరితిత్తుల్లోకి వెళ్లినట్టు సమాచారం..

సింగపూర్‌లోని ఒక పాఠశాలలో అగ్నిప్రమాదం సంభవించింది, అదే పాఠశాలలో చదువుతున్న పవన్ కళ్యాణ్ కుమారుడి చేతులు మరియు కాళ్లకు గాయాలు అయ్యాయి మరియు కొంత పొగ అతని ఊపిరితిత్తులలోకి వెళ్లినట్టు సమాచారం.


Published on: 08 Apr 2025 15:01  IST

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ సింగపూర్‌లో చదువుతుండగా ఓ ప్రమాదంలో గాయపడ్డారు. సింగపూర్‌లోని స్కూల్‌లో ఒక అగ్నిప్రమాదం జరగగా, దాంతో ఆయన చేతులు, కాళ్లకు గాయాలు కావడంతో పాటు, కొంత పొగ ఊపిరితిత్తుల్లోకి వెళ్లినట్టు తెలుస్తోంది.స్కూల్ సిబ్బంది వెంటనే మార్క్‌ను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స కొనసాగుతోంది. ప్రమాద ఘటన గురించి తెలుసుకున్న పవన్ కల్యాణ్ తన అరకు పర్యటన ముగించుకుని సింగపూర్‌కు వెళ్లారు.

మార్క్ శంకర్ ప్రస్తుతం తన తల్లి అన్నా లెజ్‌నేవా వద్ద సింగపూర్‌లో ఉంటున్నారు. ఆమె గతేడాది నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ నుండి మాస్టర్స్ డిగ్రీ పొందారు. చదువు కోసం ఆమె కుమారుడితో కలిసి అక్కడే స్థిరపడ్డారు. మార్క్ శంకర్ "రివర్ వాలీ టొమాటో కుకింగ్ స్కూల్" అనే బోధనాసంస్థలో చదువుతున్నారు. ఈ స్కూల్‌లో కిచెన్‌తో సంబంధించిన విద్యను నేర్పుతారు.

పవన్ కళ్యాణ్ గతంలో కూడా కొన్ని సార్లు సింగపూర్ వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. గతేడాది ఆయన తన భార్య మాస్టర్స్ డిగ్రీ గ్రాడ్యుయేషన్ వేడుకలో పాల్గొనడానికి వెళ్లారు. అన్నా లెజ్‌నేవా రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్ యూనివర్శిటీ నుంచి ఓరియంటల్ స్టడీస్‌లో గౌరవ డిగ్రీ పూర్తి చేశారు. ఆసియా చరిత్ర, సంస్కృతి, భాషలపై ఆమెకు మంచి అవగాహన ఉంది. ముఖ్యంగా థాయిలాండ్ చరిత్రపై ఆమె ప్రత్యేకంగా అధ్యయనం చేశారు.

ఈ ప్రమాదంలో మార్క్‌తో పాటు మరికొంతమంది విద్యార్థులు గాయపడ్డారని సమాచారం. ఘటన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ వెంటనే సింగపూర్ వెళ్లాలన్న సూచనలు వచ్చినా, ఆయన మాత్రం అరకు పర్యటన పూర్తి చేసిన తర్వాతే బయలుదేరారు.

Follow us on , &

ఇవీ చదవండి