Breaking News

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు (ఫిబ్రవరి 12, 2026) ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు.


Published on: 12 Feb 2026 17:59  IST

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు (ఫిబ్రవరి 12, 2026) ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు.కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసి మూసీ నదీ తీరంలో చేపట్టనున్న "గాంధీ సరోవర్ ప్రాజెక్టు" శంకుస్థాపన కార్యక్రమానికి (ఫిబ్రవరి చివరి వారం) ఆహ్వానించారు. బాపు ఘాట్ వద్ద అంతర్జాతీయ స్థాయి విద్యా, సాంస్కృతిక కేంద్రం ఏర్పాటుపై చర్చించారు.కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుతో భేటీ అయ్యారు.

వరంగల్ (మామ్నూర్) విమానాశ్రయం: భూసేకరణ పూర్తయినందున పనులు వెంటనే ప్రారంభించాలని కోరారు.

కొత్తగూడెం (పాల్వంచ): విమానాశ్రయం కోసం ఓఎల్ఎస్ (OLS) సర్వే, సాధ్యాసాధ్యాల అధ్యయనం చేయాలని విన్నవించారు.

ఆదిలాబాద్: అదనపు భూమిని కేంద్రానికి అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

అశ్వినీ వైష్ణవ్‌తో చర్చలు: రైల్వే మరియు ఐటీ శాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కలిసి తెలంగాణలోని పెండింగ్‌ రైల్వే ప్రాజెక్టులు, ఐటీ అభివృద్ధిపై చర్చించారు.

ఇతర సమావేశాలు: కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, సీఆర్ పాటిల్, ప్రహ్లాద్ జోషీలతో కూడా ఆయన సమావేశమయ్యే అవకాశం ఉంది. 

Follow us on , &

ఇవీ చదవండి