Breaking News

భూమికి సుదూరంగా ఎక్కడో అంతరిక్ష కేంద్రంలో 286 రోజుల పాటు గడిపిన భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్‌‌.. క్షేమంగా తిరిగివచ్చారు.

భూమికి సుదూరంగా ఎక్కడో అంతరిక్ష కేంద్రంలో 286 రోజుల పాటు గడిపిన భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్‌‌.. క్షేమంగా తిరిగివచ్చారు. తోటి వ్యోమగామి బ్యారీ బుచ్ విల్మోర్‌‌తో కలిసి భూమండలానికి చేరుకున్నారు. అమెరికాలోని ఫ్లోరిడాలో ల్యాండ్ అయ్యారు.


Published on: 19 Mar 2025 10:56  IST

భారత కాలమానం ప్రకారం ఈ తెల్లవారు జామున సరిగ్గా 3:27 నిమిషాలకు స్పేస్ ఎక్స్‌కు చెందిన డ్రాగన్ క్యాప్సుల్ క్రూ- 9.. ఫ్లోరిడాలో గల నాసా కెన్నెడీ స్పేస్ సెంటర్‌కు చేరుకుంది. ఈ క్యాప్సుల్ భూ కక్ష్యలోకి ప్రవేశించే సమయంలో కొద్దిసేపు కమ్యూనికేషన్ బ్లాక్ అవుట్ ఏర్పడింది. నాసా దాన్ని క్షణాల్లోనే పునరుద్ధరించగలిగింది. ల్యాండ్ అవ్వగానే.. సహాయ బృందాలు రంగంలోకి దిగి.. క్రూ డ్రాగన్‌ను వెలికితీస్తాయి. ఆ తర్వాత ఆస్ట్రోనాట్‌లను స్పేస్‌ఎక్స్ క్రూ డ్రాగన్ ‘ఫ్రీడమ్’ క్యాప్సూల్‌ నుంచి బయటకు తీసుకొచ్చారు. అక్కడి నుంచి వారిద్దరినీ టెక్సాస్‌లోని హ్యూస్టన్‌లో నాసాకు చెందిన జాన్సన్ స్పేస్ సెంటర్‌కు తీసుకెళ్లారు. 45 రోజుల పాటు అక్కడే రిహాబిలిటేషన్‌లో గడపనున్నారు.

ఈ మిషన్ సేఫ్ గా ముగియడంతో ఆనందం వెల్లివిరిసింది. 286 రోజుల తర్వాత సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌ మరో ఇద్దరు ఆస్ట్రోనాట్‌లు సురక్షితంగా పుడమిని చేరినట్లు నాసా ప్రకటించింది..

 

Follow us on , &

ఇవీ చదవండి