Breaking News

సికింద్రాబాద్‌ లష్కర్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర ముగింపు వేడుకల్లో భాగంగా నిర్వహించిన 'రంగం' కార్యక్రమంలో మాతంగి స్వర్ణలత భవిష్యవాణిని వినిపించారు

సికింద్రాబాద్‌ లష్కర్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర ముగింపు వేడుకల్లో భాగంగా నిర్వహించిన 'రంగం' కార్యక్రమంలో మాతంగి స్వర్ణలత భవిష్యవాణిని వినిపించారు. పచ్చి మట్టి కుండపై నిలబడి అమ్మవారిని తనలోకి ఆవహించుకుని రాబోయే రోజుల్లో జరగబోయే పరిణామాలపై ఆమె పలు కీలక హెచ్చరికలు చేశారు.


Published on: 03 Aug 2026 16:52  IST

సికింద్రాబాద్‌ లష్కర్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర ముగింపు వేడుకల్లో భాగంగా నిర్వహించిన 'రంగం' కార్యక్రమంలో మాతంగి స్వర్ణలత భవిష్యవాణిని వినిపించారు. పచ్చి మట్టి కుండపై నిలబడి అమ్మవారిని తనలోకి ఆవహించుకుని రాబోయే రోజుల్లో జరగబోయే పరిణామాలపై ఆమె పలు కీలక హెచ్చరికలు చేశారు.

రంగం భవిష్యవాణి ముఖ్యాంశాలు:

కుంభవృష్టి వర్షాలు: ఈ ఏడాది రాష్ట్రంలో కుంభవృష్టి తరహా అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని, వరద ఉధృతికి జనాలు కొట్టుకుపోయే పరిస్థితులు వస్తాయని హెచ్చరించారు.

ప్రమాదాలు - ప్రాణనష్టం: వరదలతో పాటు ఊహించని రీతిలో భారీ అగ్ని ప్రమాదాలు సంభవిస్తాయని, దీనివల్ల ప్రాణనష్టం ఎక్కువగా ఉంటుందని చెప్పారు.

అమ్మవారి ఆగ్రహం: "నేను సంతోషంగా రాలేదు, క్రోధంతో వచ్చాను" అంటూ అమ్మవారి రూపంలో స్వర్ణలత తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. భక్తులు తన మాటలను ఆచరించడం లేదని ఆగ్రహించారు.

విగ్రహ ప్రతిష్ఠ ఆలస్యం: ఆలయంలో తన విగ్రహ ప్రతిష్ఠ చేస్తామని మాటిచ్చి ఇంకా చేయలేదని, రాబోయే 6 నెలల్లోగా విగ్రహ ప్రతిష్ఠ పూర్తి చేయకపోతే వాడవాడలా ఊహించని ప్రాణనష్టం జరుగుతుందని హెచ్చరించారు. తనకు అడ్డువచ్చిన వారిని వదిలిపెట్టనని స్పష్టం చేశారు.

సామాజిక విలువల పతనం: సమాజంలో మనుషులు వావివరసలు మరిచి ఘోరాలకు పాల్పడుతున్నారని, అలాంటి అకృత్యాలు చేసేవారిని పాదాల కింద వేసి నలిపేస్తానని ఉద్ఘాటించారు.

భక్తులకు అభయం: ఎన్ని ఆపదలు, ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా తనను నమ్ముకున్న భక్తులను, గాలికి వదిలేసిన పిల్లలను ప్రతిక్షణం తానే కాపాడుకుంటానని అమ్మవారు అభయమిచ్చారు.

Follow us on , &

ఇవీ చదవండి