Breaking News

తమిళనాడు నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా తెలుగు మూలాలున్న సీనియర్ ఐఏఎస్ అధికారి డాక్టర్ ఎం. సాయికుమార్  బాధ్యతలు

తమిళనాడు నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా (Chief Secretary) తెలుగు మూలాలున్న సీనియర్ ఐఏఎస్ అధికారి డాక్టర్ ఎం. సాయికుమార్ 2026, ఏప్రిల్ 8న బాధ్యతలు చేపట్టారు.


Published on: 09 Apr 2026 12:15  IST

తమిళనాడు నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా (Chief Secretary) తెలుగు మూలాలున్న సీనియర్ ఐఏఎస్ అధికారి డాక్టర్ ఎం. సాయికుమార్ 2026, ఏప్రిల్ 8న బాధ్యతలు చేపట్టారు. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం (ECI) ఈ కీలక నియామకాన్ని చేపట్టింది. 

సాయికుమార్ తెలంగాణలో జన్మించారు. ఆయన తన విద్యాభ్యాసాన్ని హైదరాబాద్‌లోనే పూర్తి చేశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) నుండి పొలిటికల్ సైన్స్‌లో మాస్టర్స్ పట్టా పొందారు.ఈయన 1990 బ్యాచ్‌కు చెందిన తమిళనాడు కేడర్ ఐఏఎస్ అధికారి.

ఎన్నికల సమయంలో పారదర్శకత మరియు తటస్థతను కాపాడేందుకు అప్పటి సీఎస్ ఎన్. మురుగానందాన్ని బదిలీ చేస్తూ ఎన్నికల సంఘం సాయికుమార్‌ను నియమించింది.గతంలో ఆయన మదురై కార్పొరేషన్ కమిషనర్‌గా, ధర్మపురి కలెక్టర్‌గా మరియు మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామికి ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement