Breaking News

అంతర్జాతీయ టెన్నిస్ క్రీడాకారుడు, అర్జున అవార్డు గ్రహీతమైనేని సాకేత్ సాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రెవెన్యూ శాఖలో డిప్యూటీ కలెక్టర్‌గా (కేటగిరీ-II) నియమితులయ్యారు. 

అంతర్జాతీయ టెన్నిస్ క్రీడాకారుడు, అర్జున అవార్డు గ్రహీతమైనేని సాకేత్ సాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రెవెన్యూ శాఖలో డిప్యూటీ కలెక్టర్‌గా (కేటగిరీ-II) నియమితులయ్యారు.

Published on: 06 Mar 2026 11:03  IST

అంతర్జాతీయ టెన్నిస్ క్రీడాకారుడు, అర్జున అవార్డు గ్రహీతమైనేని సాకేత్ సాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రెవెన్యూ శాఖలో డిప్యూటీ కలెక్టర్‌గా (కేటగిరీ-II) నియమితులయ్యారు. 

సాకేత్ సాయి తన జాయినింగ్ రిపోర్ట్‌ను విజయవాడలోని కలెక్టరేట్‌లో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశకు సమర్పించి బాధ్యతలు స్వీకరించారు.అంతర్జాతీయ టెన్నిస్‌లో ఆయన సాధించిన విజయాలకు గుర్తింపుగా (ముఖ్యంగా 2014 ఆసియా క్రీడల పతకాలు), రాష్ట్ర ప్రభుత్వం స్పోర్ట్స్ కోటా కింద ఈ నియామకాన్ని చేపట్టింది.

ఈ నియామకానికి సంబంధించిన ప్రతిపాదనను రాష్ట్ర కేబినెట్ జూన్ 2025లోనే ఆమోదించింది.నియామక పత్రాలను అందుకున్న అనంతరం సాకేత్ మాట్లాడుతూ, ప్రభుత్వం కల్పించిన ఈ గౌరవానికి కృతజ్ఞతలు తెలిపారు. త్వరలో ఐరోపాలో జరగబోయే టెన్నిస్ పోటీల్లో పాల్గొననున్నట్లు ఆయన పేర్కొన్నారు. 

Follow us on , &

ఇవీ చదవండి