Breaking News

భారీగా బయటపడ్డ ఐఎఫ్ఎస్ అధికారి అక్రమాస్తులు

ఉత్తరాఖండ్‌కు చెందిన ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) అధికారి సుశాంత్ పట్నాయక్ నివాసం లో పక్కా సమాచారంతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు బుధవారం దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో రూ. 4.5 కోట్ల నగదు, మరో రూ.34 కోట్ల విలువైన నగలు, పత్రాలు బయటపడ్డాయి.


Published on: 09 Feb 2024 12:44  IST

హరిద్వార్‌కు చెందిన ఐఎఫ్‌ఎస్‌ అధికారి సుశాంత్‌ పట్నాయక్‌ అటవీ భూముల కుంభకోణం కేసులో నిందితుడిగా ఉన్నారు. మనీ ల్యాండరింగ్‌కు పాల్పడ్డాడన్న ఆరోపణలపై కెనాల్‌ రోడ్‌లోని ఆయన ఇంట్లో తనిఖీలు చేపట్టింది. బుధవారం ఉదయం నుంచి గురువారం తెల్లవారుజాము వరకు సోదాలు కొనసాగాయి. ఆయన ఇంట్లో ఏకంగా డబ్బు లెక్కించే మెషీన్లు చూసి ఈడీ అధికారులు షాక్ అయ్యారు. ఎన్వలప్ కవర్లలో కొంత నగదు పెట్టి, వాటిపై కొందరు ఐఎఫ్‌ఎస్‌, రేంజర్‌ స్థాయి అధికారుల పేర్లు ఉండటం ఈడీ గుర్తించింది.
త్వరలోనే వారిని కూడా విచారిస్తామని తెలిపారు. కాంగ్రెస్‌ నేత, మాజీ మంత్రి హరక్‌ సింగ్‌ నివాసంతో పాటు ఢిల్లీ, ఉత్తరాఖండ్‌ సహా దేశవ్యాప్తంగా 16 చోట్లఒకే సమయం లో దాడులు చేపట్టినట్లు ఈడీ వెల్లడించింది. సుశాంత్ పట్నాయక్ ఇంట్లో భారీగా నగదు పట్టుబడిన విషయం తెలియగానే ఆయనపై ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం ఉత్తరాఖండ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్‌ ప్రధాన కార్యదర్శిగా ఉన్న అతణ్ణి తక్షణమే హెడ్ ఆఫీస్‌కు రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశించారు. అయితే, జూనియర్ రిసెర్చ్ ఫెలో వారి పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. జనవరి 24న ఐటీ పార్క్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆఫీసులో మహిళను అభ్యంతరకరంగా తాకి,, లైంగిక వేధింపులకు పాల్పడ్డిన విషయం బయటపడింది.

Follow us on , &

ఇవీ చదవండి