Breaking News

MLC Kavitha | తులం బంగారం ఎక్క‌డ‌..? రేవంత్ రెడ్డిని నిల‌దీసిన ఎమ్మెల్సీ క‌విత‌

MLC Kavitha | పేదింటి ఆడ‌బిడ్డ‌ల వివాహానికి క‌ల్యాణ‌మ‌స్తు స్కీం కింద తులం బంగారం ఇస్తామ‌న్న హామీని రేవంత్ రెడ్డి స‌ర్కార్ నిలుపుకోలేక‌పోయింద‌ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత ధ్వ‌జ‌మెత్తారు.


Published on: 17 Mar 2025 14:32  IST

MLC Kavitha | హైద‌రాబాద్ : పేదింటి ఆడ‌బిడ్డ‌ల వివాహానికి క‌ల్యాణ‌మ‌స్తు స్కీం కింద తులం బంగారం ఇస్తామ‌న్న హామీని రేవంత్ రెడ్డి స‌ర్కార్ నిలుపుకోలేక‌పోయింద‌ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత ధ్వ‌జ‌మెత్తారు. అసెంబ్లీ ఆవ‌ర‌ణ‌లోని మీడియా పాయింట్ వ‌ద్ద ఎమ్మెల్సీ క‌విత మాట్లాడారు.

ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన హామీలు మ్యానిఫెస్టో ఖురాన్, బైబిల్, భగవద్గీతతో సమానం అని రేవంత్ రెడ్డి ప‌లుమార్లు చెప్పారు. అది అబద్ధమని శాసనమండలి సాక్షిగా బయటపడింది. కల్యాణమస్తు పథకం ద్వారా లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామని అన్నారు. కల్యాణమస్తు పథకం గురించి మేం అడిగిన ప్రశ్నకు ఆ పథకాన్ని ప్రవేశపెట్టే ఆలోచన లేదని కౌన్సిల్ సాక్షిగా సమాధానం చెప్పారు. ఎన్నికలకు ముందు ఒక మాట ఎన్నికల తర్వాత మరో మాట మాట్లాడుతూన్నారు అని క‌విత ధ్వ‌జ‌మెత్తారు.

 

Follow us on , &

ఇవీ చదవండి